TTWREIS: అశోక్‌నగర్‌ సైనిక పాఠశాలలో ఆరు, ఇంటర్ ప్రవేశాలకు ఆహ్వానం

వరంగల్‌లోని సైనిక్‌ పాఠశాలలో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్‌ 8వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు.

Updated : 11 Apr 2023 12:12 IST

హైదరాబాద్‌: వరంగల్‌ జిల్లా అశోక్‌నగర్‌లో తెలంగాణ ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సైనిక పాఠశాలలో అడ్మిషన్లకు నోటిఫికేషన్‌ విడుదలైంది.  ఎన్‌డీఏ, ఎస్‌ఎస్‌బీ తదితర సైనిక దళాల్లో ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా శిక్షణ కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఈ పాఠశాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. బాలుర కోసం ప్రారంభించిన ఈ పాఠశాలలో  ప్రధానంగా సైనిక శిక్షణపైనే దృష్టిసారించనున్నారు. అయితే, వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి  అశోక్‌నగర్‌లో బాలుర సైనిక స్కూల్‌ ఆరో తరగతి (సీబీఎస్‌ఈ), ఇంటర్మీడియట్‌(ఎంపీసీ- సీబీఎస్‌ఈ)లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.  ఒక్కో తరగతిలో 80 సీట్ల చొప్పున ఉండగా.. రాత పరీక్ష, శారీరక సామర్థ్యం, వైద్య పరీక్షల ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేయనున్నారు.  ఆసక్తి కలిగిన విద్యార్థులు ఏప్రిల్‌ 8 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలి. ఏప్రిల్‌ 23న హాల్‌ టిక్కెట్లు డౌన్‌లోడ్‌, ఏప్రిల్‌ 30న ప్రవేశ పరీక్ష, మే 5న ఫలితాలు విడుదల (ఎస్‌ఎంఎస్‌/ఫోన్‌కాల్‌ ద్వారా) చేస్తారు. మే 8 నుంచి 13వరకు ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ పరీక్షలు చేయనున్న అదికారులు.. జూన్‌ 12 నుంచి అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించనున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని