UGC: ఆ 20 యూనివర్సిటీలు ఫేక్‌.. అవి ఇచ్చే డిగ్రీలు చెల్లవు!

UGC: దేశంలో 20 నకిలీ యూనివర్సిటీల జాబితాను యూజీసీ ప్రకటించింది. ఈ జాబితాలో ఏపీలో రెండు యూనివర్సిటీలు ఉన్నట్టు తెలిపింది.

Published : 03 Aug 2023 01:39 IST

దిల్లీ: దేశంలో 20 యూనివర్సిటీలను నకిలీవిగా యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(UGC) బుధవారం ప్రకటించింది. అలాంటి యూనివర్సిటీలు దిల్లీలో అత్యధికంగా ఎనిమిది ఉండగా.. యూపీలో నాలుగు, ఏపీ, బెంగాల్‌లో రెండేసి, మిగతా రాష్ట్రాల్లో ఒక్కొక్కటి చొప్పున ఉన్నట్టు గుర్తించినట్టు తెలిపింది. ఈ వర్సిటీలకు డిగ్రీలు ప్రదానం చేసే అధికారం లేదని స్పష్టం చేసింది. యూజీసీ చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా పలు సంస్థలు డిగ్రీలు ప్రదానం చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చినట్టు యూజీసీ తెలిపింది. అలాంటి విశ్వవిద్యాలయాలు ప్రదానం చేసే డిగ్రీలను ఉన్నత విద్య, ఉద్యోగ ప్రయోజనాల కోసం గుర్తించబోమని.. ఆ డిగ్రీలు చెల్లుబాటు కావని UGC తేల్చి చెప్పింది. ఈ యూనివర్సిటీలకు అసలు డిగ్రీలు ఇచ్చే అధికారమే లేదని యూజీసీ కార్యదర్శి మనీష్‌ జోషీ ఓ ప్రకటనలో వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులోని కాకుమానివారితోటలో క్రైస్ట్ న్యూ టెస్టమెంట్ డీమ్డ్ యూనివర్సిటీ; విశాఖలోని బైబిల్ ఓపెన్ యూనివర్శిటీ ఆఫ్ ఇండియాను నకిలీవిగా యూజీసీ ప్రకటించింది. ఫేక్‌ యూనివర్సిటీల పూర్తి వివరాలతో కూడిన జాబితా  https://www.ugc.gov.in/ ఈ లింక్‌పై క్లిక్‌ చేసి పొందొచ్చు.

దిల్లీలో ఫేక్‌ యూనివర్సిటీలు (8)..

  • ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్ అండ్‌ఫిజికల్‌ హెల్త్‌ సైన్సెస్‌
  • కమర్షియల్‌ యూనివర్సిటీ లిమిటెడ్‌- దర్యాగంజ్‌
  •  యునైటెడ్‌ నేషన్స్‌ యూనివర్సిటీ
  • వొకేషనల్‌ యూనివర్సిటీ;
  • ఏడీఆర్‌ సెంట్రిక్‌ జ్యూరిడికల్‌ యూనివర్సిటీ
  • ఇండియన్‌ ఇన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ సైన్సెస్‌ అండ్‌ ఇంజినీరింగ్‌
  •  విశ్వకర్మ ఓపెన్‌ యూనివర్సిటీ ఫర్‌ సెల్ఫ్‌ ఎంప్లాయిమెంట్‌;
  • ఆధ్యాత్మిక్‌ విశ్వవిద్యాలయ (ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం)

ఉత్తరప్రదేశ్‌లో (4)..

  • గాంధీ హిందీ విద్యాపీఠ్‌
  • నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఎలక్ట్రో కాంప్లెక్స్‌ హోమియోపతి
  • నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ యూనివర్సిటీ (ఓపెన్‌ యూనివర్సిటీ)
  •  భారతీయ శిక్షా పరిషత్‌ ఉన్నట్టు తెలిపింది. 

పశ్చిమబెంగాల్‌లో(2)..

  • ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ఆఫ్‌ ఆల్టర్నేటివ్‌ మెడిసిన్‌
  • ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆల్టర్నేటివ్‌ మెడిసిన్‌ అండ్‌ రీసెర్చి
  • బదగాన్వి సర్కార్ వరల్డ్ ఓపెన్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ సొసైటీ (కర్ణాటక)
  • సెయింట్‌ జాన్స్‌ యూనివర్సిటీ (కేరళ)
  • రాజా అరబిక్‌ యూనివర్సిటీ(మహారాష్ట్ర)
  • శ్రీ బోధి అకాడమీ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌(పుదుచ్ఛేరి)

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని