UGC NET Results: యూజీసీ నెట్‌ ఫలితాలు వచ్చేశాయ్‌..

UGC NET Results: యూజీసీ నెట్‌ (డిసెంబరు) పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు తమ ఫలితాలను తెలుసుకోండిలా..

Updated : 22 Jan 2024 17:27 IST

దిల్లీ: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (డిసెంబరు) 2023 (UGC- NET) పరీక్ష ఫలితాలు వచ్చేశాయి.  అభ్యర్థులు ugcnet.nta.ac.in వెబ్‌సైట్‌లో వీటిని తెలుసుకోవచ్చు. అప్లికేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలతో పాటు అక్కడ పేర్కొన్న సెక్యూరిటీ పిన్‌ను ఎంటర్‌ చేసి ఫలితాలు చూడొచ్చు.

ఫలితాల కోసం క్లిక్‌ చేయండి

దేశంలోని యూనివర్సిటీల్లో లెక్చరర్‌షిప్ (అసిస్టెంట్ ప్రొఫెసర్), జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కోసం యూజీసీ నెట్ పరీక్షను NTA ఏటా రెండు సార్లు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా గతేడాది డిసెంబర్‌ 6 నుంచి 19వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో UGC NET పరీక్షను నిర్వహించింది. మొత్తం 83 సబ్జెక్టులకు దేశవ్యాప్తంగా 292 నగరాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 9,45,918 మంది రిజిస్టర్‌ చేసుకున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని