UPSC Prilims: సివిల్స్‌ ప్రిలిమ్స్‌-2023.. ఈ-అడ్మిట్‌ కార్డులొచ్చేశాయ్‌!

మే 28న జరిగే సివిల్‌సర్వీసెస్‌ ప్రిలిమ్స్‌ పరీక్షకు ఈ-అడ్మిట్‌కార్డులు విడుదలయ్యాయి.

Published : 08 May 2023 19:40 IST

దిల్లీ: అఖిల భారత సర్వీసుల్లో అధికారులను భర్తీ చేసేందుకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) ఏటా నిర్వహించే సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమ్స్‌ పరీక్ష ఈ-అడ్మిట్‌ కార్డులు విడుదలయ్యాయి. మొత్తం 1,105 సివిల్ సర్వీస్‌ ఉద్యోగాల భర్తీకి ఫిబ్రవరి 1 నుంచి 21 వరకు యూపీఎస్సీ దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. పరీక్షకు సమయం దగ్గర పడుతుండటంతో  అడ్మిట్ కార్డుల్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. 

ప్రిలిమ్స్‌, మెయిన్స్‌, ఇంటర్వ్యూ, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా సివిల్‌ సర్వీసెస్‌ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. అర్హులైన అభ్యర్థులనుంచి దరఖాస్తుల స్వీకరించిన యూపీఎస్సీ.. ప్రిలిమ్స్‌ పరీక్ష మే 28న జరగనున్న వేళ తాజాగా ఈ-అడ్మిట్‌ కార్డులను జారీ చేసింది. మే 8 నుంచి 28వ తేదీ వరకు ఈ-అడ్మిట్‌ కార్డులను పొందవచ్చని తెలిపింది.  అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్‌ ఐడీ లేదా రోల్‌ నంబర్‌తో పాటు పుట్టినతేదీ వివరాలను నమోదు చేయడం ద్వారా అడ్మిట్‌కార్డును పొందొచ్చు.

ఈ-అడ్మిట్‌ కార్డు కోసం క్లిక్‌ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని