వైరస్‌ పని పడుతుంది

చాలామందికి చేతిలో సెల్‌ఫోన్‌ లేకుండా గడవదు. కానీ స్మార్ట్‌ఫోన్‌, గ్యాడ్జెట్‌ల ఉపరితలాలపై వైరస్‌ ఎక్కువ కాలం ఉంటుందనేది ఇప్పుడు మనల్ని కలవరపెట్టే విషయం. ఫోన్‌ని శానిటైజ్‌ చేస్తున్నప్పుడు తుంపర్లు లోపలికి

Published : 22 May 2021 00:13 IST

చాలామందికి చేతిలో సెల్‌ఫోన్‌ లేకుండా గడవదు. కానీ స్మార్ట్‌ఫోన్‌, గ్యాడ్జెట్‌ల ఉపరితలాలపై వైరస్‌ ఎక్కువ కాలం ఉంటుందనేది ఇప్పుడు మనల్ని కలవరపెట్టే విషయం. ఫోన్‌ని శానిటైజ్‌ చేస్తున్నప్పుడు తుంపర్లు లోపలికి వెళ్లిపోతే పాడయ్యే అవకాశం ఉంది.    దీనికి విరుగుడుగా ‘సైక్లోప్స్‌’   అనే యూవీ-సీ డివైజ్‌ విపణిలోకి వచ్చింది. దాన్ని జస్ట్‌ ఛార్జింగ్‌ పోర్ట్‌లో పెడితే చాలు. ఇరవై సెకన్లలో99శాతం సూక్ష్మక్రిములు, వైరస్‌లను చంపేస్తుందట. ఈ పరికరం నుంచి వెలువడే అల్ట్రా వయోలెట్‌ కిరణాలు మనకి ఎలాంటి హాని చేయకుండానే   పని ముగిస్తాయంటోంది తయారీ కంపెనీ.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని