డెమీ..భారత్‌పై ప్రేమ

జగమెరిగిన పాటగత్తె డెమీ లొవాటోకి ప్రపంచంలో ఏ మూలకెళ్లినా అభిమానులుంటారు. తనకి మాత్రం భారత్‌ అంటే చెప్పలేనంత ప్రేమ. ‘భారతీయ వేదాలంటే నాకు చాలా గౌరవం’ అని చెబుతూ, ఇక్కడి మహిళా సమస్యలపై స్పందిస్తూ..

Updated : 07 Aug 2021 05:55 IST

గమెరిగిన పాటగత్తె డెమీ లొవాటోకి ప్రపంచంలో ఏ మూలకెళ్లినా అభిమానులుంటారు. తనకి మాత్రం భారత్‌ అంటే చెప్పలేనంత ప్రేమ. ‘భారతీయ వేదాలంటే నాకు చాలా గౌరవం’ అని చెబుతూ, ఇక్కడి మహిళా సమస్యలపై స్పందిస్తూ.. చాలా సందర్భాల్లో ఆ ఇష్టాన్ని చాటుకుంటూనే ఉంది. ఈసారి ఆ అభిమానాన్ని తన షో ద్వారా చాటుకుంది. ‘4 డీ విత్‌ డెమీ లొవాటో’ అనే పాపులర్‌ యూట్యూబ్‌ షో నిర్వహిస్తుంటుంది తను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెలెబ్రెటీలను ఎంచుకొని ఈ టాక్‌ షోలో పలు విషయాలు మాట్లాడుతుంది. ఈసారి ముఖ్య అతిథిగా ఆధ్యాత్మిక గురువు సద్గురును ఆహ్వానించింది. మనిషిలోని అంతర్గత ఆనందం, ఆధ్యాత్మికం, పర్యావరణం, మోటార్‌సైకిళ్లతో ఆయనకి ఉన్న అనుబంధం.. ఇలా పలు అంశాలపై చర్చ జరిగింది. నలభై నిమిషాల ఈ వీడియో బాగా వైరల్‌ అయ్యింది. ‘చర్చని మరోస్థాయికి తీస్కెళ్లారు. ఇంకోసారి సద్గురుతో షో చేయాలి’ అని ఒకరంటే.. ‘పాశ్చాత్యం, ఆధ్యాత్మికం కలయిక అద్భుతం’ అని మరొకరు కామెంట్‌ చేశారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని