సులువైన టిప్స్‌..సొగసైన లుక్స్‌

స్టైలిష్‌గా కనిపించాలంటే ఖరీదైన దుస్తులే వేసుకోనక్కర్లేదు. చిన్నపాటి ట్రిక్స్‌ పాటిస్తే చాలు. మ్యాన్లీగా ఉండాలంటే బ్రాండెడ్‌ ఔట్‌ఫిట్‌లే తొడగక్కర్లేదు.. మేలిమి  టిప్స్‌ ఫాలో అయితే బెటర్‌. ఇంతకీ ఏంటవి?

Updated : 04 Sep 2021 04:18 IST

ఫ్యాషన్‌ మంత్ర

స్టైలిష్‌గా కనిపించాలంటే ఖరీదైన దుస్తులే వేసుకోనక్కర్లేదు. చిన్నపాటి ట్రిక్స్‌ పాటిస్తే చాలు. మ్యాన్లీగా ఉండాలంటే బ్రాండెడ్‌ ఔట్‌ఫిట్‌లే తొడగక్కర్లేదు.. మేలిమి  టిప్స్‌ ఫాలో అయితే బెటర్‌. ఇంతకీ ఏంటవి?

* రంగు: మనం స్టైలిష్‌గా కనిపించడంలో దుస్తుల రంగు పాత్ర కీలకం. పర్సనాలిటీ, శరీర ఛాయకు నప్పే రంగులు ఎంచుకోవాలి. దాంతోపాటు వేడుక, సందర్భానికి తగ్గట్టుగా దుస్తులు ధరించాలి. డేట్‌, పార్టీ... లాంటివాటికైతే గులాబీ రంగు నప్పుతుంది. డార్క్‌, న్యూట్రల్‌ రంగులు అందరికీ బాగుంటాయి. శరీర ఛాయకి వ్యతిరేక రంగులు వేస్తే బాగా ఎలివేట్‌ అవుతాయి.

* సైజులు: డ్రెస్‌ ఎంత మంచి డిజైన్‌ది అయినా, మంచి ఫ్యాబ్రిక్‌ అయినా ఒంటికి సరిగ్గా సరిపోతేనే చూడ్డానికి అందంగా కనిపిస్తాం. కొలత కొంచెం అటుఇటు అయినా ఫర్వాలేదని రాజీ పడితే ఎబ్బెట్టుగా ఉండటమే కాదు.. ధరించడానికి అసౌకర్యంగా కూడా ఉంటాయి.

* కళ్లద్దాలు: దసరాబుల్లోడిలా కాస్త స్టైలిష్‌గా కనపడాలంటే ముఖానికి ఓ సన్‌గ్లాస్‌ తగిలిస్తే సరి. సన్‌గ్లాస్‌ లేదా గాగుల్స్‌ తప్పకుండా అదనపు అందం తీసుకొస్తాయి. మొహం ఆకారం ఆధారంగా నప్పేవి ఎంచుకోవచ్చు.

* హెయిర్‌ స్టైల్‌: ఎప్పటికప్పుడు కొత్తగా, స్టైలిష్‌గా కనపడాలంటే కనీసం రెండు, మూడైనా హెయిర్‌స్టైల్స్‌ మెయింటెయిన్‌ చేయాల్సిందే. కాలాలకు తగ్గట్టుగా వేసవిలో పొట్టి, చలికాలంలో పొడుగ్గా ఉండే హెయిర్‌ స్టైల్‌ని ఫాలో అయితే బాగుంటుంది.

* షూస్‌: స్టైలిష్‌గా, గంభీరంగా కనిపించాలనుకుంటే షూస్‌ ధరించడం తప్పనిసరి. పొట్టిగా ఉన్న కుర్రాళ్లు షూలు ధరిస్తే రెండు, మూడు అంగుళాలు పొడుగ్గా కనిపిస్తారు. ట్రౌజర్‌ను పోలిన రంగువే ఎంచుకుంటే సమన్వయం కుదురుతుంది.

* స్వెటర్‌: నిట్‌వేర్‌ (స్వెటర్‌) ధరిస్తే కుర్రాళ్లు మరింత మ్యాన్లీగా కనిపిస్తారు. చలికాలంలోనే కాకుండా తేలికైన ఫ్యాబ్రిక్‌తో తయారైన నిట్‌వేర్‌ అన్నికాలాల్లోనూ ధరించవచ్చు. ఇందులోనూ మెడను చుట్టేసే డిజైన్‌వి మరింతగా ఆకర్షణీయంగా ఉంటాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని