రీసైకిల్‌ సొగసుల మేళా!

అందంగా కనిపించాలి.. డిజైన్‌ అదిరిపోవాలి.. ఒంటిపై హుందాగా ఒదిగిపోవాలి.. ఎప్పుడైనా ఇదే ఫ్యాషన్‌ మంత్రం. అందుకే ఫ్యాబ్రిక్‌ ఏదైనా ఓకే అంటారు డిజైనర్లు, సెలెబ్రెటీలు, సొగసుల స్పృహ ఉన్న కుర్రకారు. దానికి...

Updated : 23 Oct 2021 06:49 IST

అందంగా కనిపించాలి.. డిజైన్‌ అదిరిపోవాలి.. ఒంటిపై హుందాగా ఒదిగిపోవాలి.. ఎప్పుడైనా ఇదే ఫ్యాషన్‌ మంత్రం. అందుకే ఫ్యాబ్రిక్‌ ఏదైనా ఓకే అంటారు డిజైనర్లు, సెలెబ్రెటీలు, సొగసుల స్పృహ ఉన్న కుర్రకారు. దానికి తగ్గట్టే ఇప్పుడు ‘రీసైకిల్డ్‌ ఫ్యాషన్‌ ఔట్‌ఫిట్స్‌’ జోరందుకుంటున్నాయి. అంతర్జాతీయంగా పేరున్న ప్రముఖుల నుంచి బాలీవుడ్‌ తారల వరకు ఈ ట్రెండ్‌ని ఫాలో అవుతున్నారు. ఈమధ్యే నిర్వహించిన లాక్మే ఫ్యాషన్‌ వీక్‌లో మన బాలీవుడ్‌ నటి దియా మీర్జా రీసైకిల్డ్‌ ప్లాస్టిక్‌ బాటిళ్లతో తయారు చేసిన డ్రెస్‌ వేసుకొని క్యాట్‌వాక్‌ చేస్తే అంతా నోరెళ్లబెట్టి చూశారు. అబ్రహం-థాకోరే డిజైనర్ల ద్వయం ఈ నలుపురంగు పొడవాటి డ్రెస్‌ని డిజైన్‌ చేశాడు. రాచరికాన్ని వదిలి సామాన్యురాలిగా మారిన కేట్‌ మిడిల్‌టన్‌ సైతం ఈ ధోరణికి మరింత ఊపు తెచ్చింది. ‘ఎర్త్‌షాట్‌ ప్రైజ్‌’ కార్యక్రమంలో ప్లాస్టిక్‌ వ్యర్థాల ఫ్యాబ్రిక్‌తో తయారు చేసిన గౌను వేసుకొని హొయలొలికించింది. దీన్ని ప్రఖ్యాత డిజైనర్‌ అలెగ్జాండర్‌ మెక్‌క్వీన్‌ డిజైన్‌ చేశాడు. అదే షోలో పాప్‌ సింగర్‌, నటి ఎమ్మా వాట్సన్‌ సైతం రీసైకిల్డ్‌ డ్రెస్‌ ధరించింది. ఈ తరహా జోరును ముందే కనిపెట్టిన జపాన్‌ లగ్జరీ డిపార్ట్‌మెంట్‌ స్టోర్‌ తకాషిమాయా పెద్దఎత్తున ఈ రీసైక్లింగ్‌ ఫ్యాషన్‌ ఔట్‌ఫిట్స్‌ తయారు చేయిస్తోంది. దీనికోసం ప్రపంచవ్యాప్తంగా వంద ఫ్యాషన్‌ బ్రాండ్లతో ఒప్పందం కుదుర్చుకుంది. చూడ్డానికి హుందాగా ఉండటంతోపాటు, సౌకర్యవంతంగా ఉండటంతో భవిష్యత్తులో ఈ ఎకోఫ్రెండ్లీ ఫ్యాషన్లు పరుగులు పెట్టే అవకాశం ఉందంటున్నారు ఫ్యాషన్‌ పండితులు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని