వాటర్‌ బాటిల్‌.. వైరస్‌కి చెక్‌!

జిమ్‌.. ఆఫీసు.. దూర ప్రయాణాలు.. యువత ఎక్కడికెళ్లినా వెంటన వాటర్‌ బాటిల్‌ ఉండాల్సిందే. కానీ ఇది అసలే వైరస్‌ల కాలం..

Updated : 18 Dec 2021 06:20 IST

ధర: రూ.2వేలు

జిమ్‌.. ఆఫీసు.. దూర ప్రయాణాలు.. యువత ఎక్కడికెళ్లినా వెంటన వాటర్‌ బాటిల్‌ ఉండాల్సిందే. కానీ ఇది అసలే వైరస్‌ల కాలం.. ఎక్కడ పడితే అక్కడ నీటిని అందులో పట్టుకొని తాగలేం కదా! ఆ సమస్యకు చెక్‌ పెట్టేదే ‘హువే హార్మొనీ ఓఎస్‌’ వాటర్‌ బాటిల్‌. దీని ప్రత్యేకంత ఏంటంటే.. దీంట్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్‌ సర్ఫేస్‌ కోటింగ్‌ కారణంగా ఇందులో నీళ్లు పట్టిన క్షణాల్లోనే చెడు బ్యాక్టీరియా, వైరస్‌ చనిపోతుంది. పైగా ఈ బాటిల్‌ మూత భాగంలో ఓ ఎల్‌ఈడీ తాకే తెర ఉంటుంది. సమయం, స్టాప్‌వాచ్‌.. ఇలా కొన్ని ఫీచర్లు సెట్‌ చేసుకోవచ్చు. రోజులో ఎన్ని లీటర్లు నీరు తాగారో లెక్కగట్టి కూడా చెబుతుంది. దీని లోపలి భాగం స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ కావడంతో తుప్పు పట్టే సమస్యే లేదు. దీన్ని మనసుకి నచ్చినవారికి కానుఖగా కూడా ఇవ్వొచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు