ఇలా చేయరా... సృజనా!

క్రియేటివిటీ... అదేనండీ సృజనాత్మకత... ఈ పదం చాలాసార్లే వింటుంటాం... మనసులోని ఊహలకు రూపమివ్వడం... వైవిధ్యంగా, విభిన్నంగా చేయడమే సృజనాత్మకత... ఇప్పుడు దీని గురించి ఎందుకంటారా? ఈ నెల అదేనండీ... జనవరి అంతర్జాతీయసృజనాత్మకత మాసం...

Updated : 04 Jan 2020 00:23 IST

సృజన మాసం

క్రియేటివిటీ... అదేనండీ సృజనాత్మకత... ఈ పదం చాలాసార్లే వింటుంటాం... మనసులోని ఊహలకు రూపమివ్వడం... వైవిధ్యంగా, విభిన్నంగా చేయడమే సృజనాత్మకత... ఇప్పుడు దీని గురించి ఎందుకంటారా? ఈ నెల అదేనండీ... జనవరి అంతర్జాతీయసృజనాత్మకత మాసం... మరి ఈ సందర్భంగా కొన్ని క్రియేటివ్‌ ఆలోచనలు చేద్దామా? మీలో ఉన్న సృజనాత్మకత బయటకు తీద్దామా? ఇదిగోండి ఇక్కడున్నట్టు మనం పడేసే పెన్సిల్‌ పొట్టు దగ్గర్నుంచి తినే ఆహారం వరకు ఆ క్రియేటివిటీ చూపించేయొచ్చు!


పిడికిలిలో నెలలు!

మనకు నెలలు 12.. ఓ నెలలో 30 రోజులు మరో నెలలో 31 రోజులుంటాయి. ఏ నెలలో ఎన్ని రోజులో ఠక్కున చెప్పాలంటే చిక్కే. ఒక్క ఫిబ్రవరి నెల మాత్రం కాస్త నయం. 28 రోజులుంటాయని తేలిగ్గా తెలిసిపోతుంది. లీపు సంవత్సరంలో మాత్రం 29 రోజులుంటాయి. మిగతా నెలలన్నీ కాస్త తికమకే. దీన్ని ఓ చిన్న చిట్కాతో దూరం చేసుకోవచ్ఛు ఎలా అంటే.. పిడికిలి బిగించండి. వేళ్ల ఎముకల దగ్గర బొడిపెలు ఉంటాయి కదా. ముందుగా చూపుడు వేలు బొడిపెను జనవరి, పక్కనే ఉన్న లోయను ఫిబ్రవరి, ఆ పక్కనే ఉన్న మరో వేలు బొడిపెను మార్ఛి. ఆ పక్కనే ఉన్న లోయను ఏప్రిల్‌గా.. ఇలా లెక్కించండి. మళ్లీ ఆగస్టు నెలను అక్కడి నుంచి వెనక్కి లెక్కపెడితే సరి. బొడిపె పైన వచ్చే నెలలకు 31 రోజులు, లోయలో వచ్చే నెలలకు 30 రోజులు ఉంటాయి.


చేతుల్లో జీవులు!

జంతువులు ఎక్కడుంటాయి.. అడవిలో.. లేదంటే జూలో! కుక్క, పిల్లి, పావురం, చిలుక.. ఇలాంటి జీవులైతే మనమధ్యే ఉంటాయి. వీటన్నింటినీ మన చేతుల వేళ్లను రకరకాలుగా పెడుతూ సృష్టించవచ్ఛు.


చకచకా ఎంచక్కా 19వ ఎక్కం

పిల్లలూ మీకు 19వ టేబుల్‌ వచ్చా! కొంచెం కష్టం కదా! కానీ ఓ చిన్న చిట్కాతో చిటికెలో 19వ ఎక్కం ఎంచక్కా నేర్చుకోవచ్ఛు ఎలాగో చెప్పనా.. ముందు కాగితంపై 19x1= నుంచి 19x10= వరకు వరసగా రాసుకోండి. ఇప్పుడు పై నుంచి వరసగా 1 3 5 7.. ఇలా బేసి సంఖ్యలు 19 వరకు రాయండి. తర్వాత 19 పక్కనే 0 ఆపైన 1 దాని మీద 2.. దాని మీద 3 ఇలా.. తొమ్మిది వరకు రాయండి. ఇప్పుడు చూడండి 19వ టేబుల్‌ సిద్ధం!

పిల్లలూ! మీరూ ఇలాంటి క్రియేటివిటీ యాక్టివిటీస్‌ మాకు పంపొచ్ఛు

మా చిరునామా: హాయ్‌బుజ్జీ ఈనాడు ప్రధాన కార్యాలయం, రామోజీ ఫిలింసిటీ, హైదరాబాద్‌-501 512

email: hb.eenadu@gmail.com


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని