నివేదిత.. చిన్ని రుద్రమ!

చాలా మందికి బోర్‌ అనిపించే చరిత్ర అంటే ఆ చిన్నారికి ఎంతో ఇష్టం. ఆ ఆసక్తే స్వాతంత్య్ర సమరయోధులు, జాతీయ వాదుల గురించి తెలుసుకునేలా చేసింది.. అంతే కాదండోయ్‌..! వారి పాత్రల్లో నటిస్తూ.. శభాష్‌ అనిపించుకుంటోంది తొమ్మిదేళ్ల నివేదిత. ఇటీవల జూమ్‌ యాప్‌ వేదికగా జరిగిన ప్రపంచ తెలుగు సాంస్కృతికోత్సవాల్లో రాణీరుద్రమదేవిగా అభినయం, డైలాగులతో మెప్పించి మొదటి బహుమతి సాధించింది.

Published : 28 Aug 2020 01:27 IST

● అమ్మానాన్న, చదువు?

నివేదిత నాన్న దత్తాత్రేయ రైల్వే ఉద్యోగి, అమ్మ లత గృహిణి. హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని కేంద్రీయ విద్యాలయంలో మూడో తరగతి చదువుతోంది. రెండేళ్లుగా కూచిపూడి శిక్షణ తీసుకుంటోంది.

● స్ఫూర్తి ఎవరు? ఇంకా ఏం చేస్తుంటుంది?

ప్రముఖ నృత్యకళాకారిణి యామిని కృష్ణమూర్తి నృత్యం చూసి చిన్నారి స్ఫూర్తి పొందింది. యూట్యూబ్‌లో ఓ ఛానెల్‌ ప్రారంభించి.. గణితంలో మెలకువలు, పాఠాలు చెబుతోంది.

● ఎలా సాధన చేసింది?

గతంలో నిర్వహించిన తెలుగు ప్రపంచ మహాసభల్లో ఫైనల్‌కి చేరి.. విజయం సాధించలేకపోయినా నిరుత్సాహ పడలేదు. పొరపాట్లు సరిదిద్దుకుంటూ.. మరింత పట్టుదలతో సాధన చేసింది. ఇటీవల రుద్రమదేవిగా సుమారు 480 మందికిపైగా పాల్గొన్న పోటీలో గుక్కతిప్పుకోకుండా రెండున్నర నిమిషాలపాటు డైలాగ్‌ చెప్పి అబ్బురపరిచింది. ప్రాక్టీస్‌ కూడా మేకప్‌ వేసుకొనే చేసేదంట.

● చరిత్ర అంటే ఆసక్తి ఎలా ఏర్పడింది?

నివేదిత నాన్నకు పౌరాణికాలు, పోరాటయోధులంటే చాలా ఇష్టమట. అలా తనకూ చిన్నతనంలోనే ఆసక్తి ఏర్పడింది. చరిత్రకారుల హావభావాలు ఎలా ఉండాలి? డైలాగ్స్‌ ఎలా చెప్పాలో తండ్రి నేర్పించేవారట.

● లక్ష్యం ఏంటి?

చదువు, నృత్యంలో మంచి ప్రతిభ చూపుతూ.. గొప్ప కళాకారిణిగా రాణించడమే తన లక్ష్యమని చెబుతున్న చిన్నారికి మనమూ ఆల్‌ ది బెస్ట్‌ చెప్పేద్దామా!!

- తమ్మా తేజస్విని మణిమాల, ఈజేఎస్‌

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని