నక్కకు గుణపాఠం

ఒక అడవికి రాజుగా సింహం ఉండేది. అడవిలోని జంతువుల కష్టనష్టాలేమిటో తెలుసుకోవడానికి ఒక నక్కను నియమించుకుంది. సింహం నక్క మాటలకు విలువిచ్చేది. సింహానికి తన మాట మీదున్న నమ్మకాన్ని ఆసరాగా చేసుకొని నక్క జంతువులను

Published : 04 Apr 2021 02:10 IST

ఒక అడవికి రాజుగా సింహం ఉండేది. అడవిలోని జంతువుల కష్టనష్టాలేమిటో తెలుసుకోవడానికి ఒక నక్కను నియమించుకుంది. సింహం నక్క మాటలకు విలువిచ్చేది. సింహానికి తన మాట మీదున్న నమ్మకాన్ని ఆసరాగా చేసుకొని నక్క జంతువులను బెదిరించి తన పనులు చక్కబెట్టుకునేది.
ఒకసారి అరటిగెల తీసుకెళుతున్న ఏనుగును అడ్డగించి, ఆ గెలను తనకిచ్చి వెళ్లమంది నక్క.
‘నా పిల్ల అనారోగ్యంతో, ఆకలితో అల్లాడుతూ పడుకుని ఉంది. దాని కోసం ఇది. నన్ను వదిలెయ్‌!’ అని ఏనుగు ప్రాధేయపడింది.
నక్క కనికరించలేదు. ‘సింహానికి నీ మీద ఏదో ఒక తప్పుడు ఫిర్యాదు చేసి చంపించేస్తా!’ అంది.
ఏనుగు బెదిరిపోయింది. గెలను నక్కకిచ్చి, మరో గెల కోసం వెళ్లింది. నక్కను తిట్టుకుంటూ వెళుతున్న ఏనుగును ఒక కోతి చూసి కారణమడిగింది. ఏనుగు జరిగిన సంగతి చెప్పి ‘ఈ అడవికి ఈ మాయదారి నక్క పీడ ఎప్పుడు వదులుతుందో!’ అంది.
‘నేను నక్కపీడ వదిలిస్తాను’ అంది కోతి. ఏనుగుకు ఒక పథకం చెప్పింది. అన్ని జంతువులను కలిసి తన పథకం వివరించింది కోతి. జంతువులు సంతోషంగా సహకరిస్తామన్నాయి.
సింహం నీరు తాగుతుంటే చెట్టుపైనున్న ఉడతల్లో ఒకటి ‘నక్క మన సింహం రాజును చంపి ఈ రాజ్యాన్ని పొరుగునున్న అడవిలోని సింహం రాజుకు అప్పజెప్పడానికి ఒప్పందం చేసుకుంటుంటే నేను చూశాను.’ అంది.
‘ఈ విషయం సింహం రాజుకు చెబుదామా?’ అంది రెండో ఉడత.
‘మనం చెప్పినా సింహం నమ్మదు. నక్క మాటలే నమ్ముతుంది’ అంది మొదటి ఉడత.
‘పొరుగు రాజు అధికారాన్ని ఒప్పుకొంటే కానుకలిస్తామని, వ్యతిరేకిస్తే ఫలితమెలా ఉంటుందో చెప్పడానికి నక్క పెద్ద కొండ దగ్గర సమావేశం ఏర్పాటు చేస్తోంది. మనమూ వెళ్లాలి’ అంది మొదటి ఉడత.
ఉడతలు ఊహించినట్లుగానే ఆ మాటలు సింహం చెవిన పడ్డాయి. అది నక్క మీద కోపంతో ఊగిపోయింది. నిజమేమిటో తెలుసుకోవడానికి పెద్ద కొండ దగ్గరకు బయలుదేరింది. ఈలోగా ఒక ఎలుక నక్క దగ్గరకొచ్చింది. ‘నక్కగారూ! మీ గురించి సింహం రాజుకు చాడీలు చెప్పడానికి, కలిసికట్టుగా వెళ్లాలని జంతువులన్నీ పెద్దకొండ దగ్గర సమావేశమయ్యాయి’ అని చెప్పింది.
ఎలుక మాటలతో నక్క పెద్దకొండ దగ్గరకు బయలుదేరింది. అక్కడ జంతువులన్నీ సమావేశమై ఉన్నాయి. నక్క వెంటనే అక్కడున్న ఒక బండరాయి మీదకు ఎక్కింది. ‘నన్నే ఎదిరించాలని చూస్తారా? నన్ను సింహం ఏం చేస్తుంది? సింహానికి నేను ఎంత చెబితే అంత. నేను ఏం చెప్పినా నమ్ముతుంది. మీ మాటలు నమ్మదు’ అంటూ అరిచింది.
అప్పటికే బండరాయి వెనుకకు చేరుకున్న సింహం ఉడతల మాటలు నిజమేనని భావించి నక్క మీద దాడి చేసింది. ఆ అడవి నుంచి బహిష్కరించింది.
నక్క ముక్కుతూ, మూల్గుతూ ఆ అడవిని వదిలి వెళ్లిపోయింది. నక్క పీడ విరగడయినందుకు జంతువులు సంతోషించాయి.
- డి.కె. చదువులబాబునక్కకు గుణపాఠం

- డి.కె. చదువులబాబు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు