రోజుకో పద్యం

అంటే.. కూర ఎంత రుచిగా వండినా.. ఉప్పు వెయ్యకపోతే తినడానికి పనికిరాదు. ఆహారంలో పప్పు ఉంటేనే బలం వస్తుంది.

Published : 12 May 2020 00:24 IST

ఉప్పులేని కూర యొప్పదు రుచులకు
పప్పులేని తిండి ఫలములేదు
అప్పులేనివాడె యధిక సంపన్నుడు
విశ్వదాభిరామ వినురవేమ!

అంటే.. కూర ఎంత రుచిగా వండినా.. ఉప్పు వెయ్యకపోతే తినడానికి పనికిరాదు. ఆహారంలో పప్పు ఉంటేనే బలం వస్తుంది. మన దగ్గర డబ్బున్నా లేకపోయినా అప్పు చేయకుండా ఉంటే చాలు, మనం ధనవంతులమే.


పదాల పాము

ఇక్కడున్న ఆధారాలతో ఇంగ్లిషు పదాల్ని పాములోని వృత్తాల్లో నింపండి. ఒకదాని చివరి అక్షరమే మరో దానికి ఆరంభం అవుతుంది. ఆధారాలు: 1.గబ్బిలం 2.కుళాయి 3.పంది 4.బాలిక 5.కాళ్లు 6.సూర్యుడు 7.మెడ 8.గాలిపటం 9.పదకొండు 10.రాత్రి 11. తేనీరు 12. నటుడు 13.తాడు 14. ఖాళీ 15. పసుపు(రంగు) 16.నీరు 17.ఉంగరం 18.మేక 19.పచ్చబొట్టు 20. నారింజ.


సుడోకు

ఈ సుడోకును 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు వరుసల్లోనూ, 3శ్రీ3 చదరాల్లోనూ అన్ని అంకెలూ ఉండాలి. ఏదీ రెండుసార్లు రాకూడదు.


నేనుగీసిన బొమ్మ

స్వీయరక్షణే... పుడమి రక్షణ!


చెప్పుకోండి చూద్దాం!

ఉన్నది ఉన్నట్లు చెబుతా.. లేనిది లేనట్లు చూపుతా.. నన్ను తప్పుపట్టే వారేలేరు. నేనెవరో.. చెప్పుకోండి చూద్దాం?


బొమ్మ గీద్దాం


ఎటు చదివినా ఒకటే!

* Some men interpret nine memos
* Satan, oscillate my metallic sonatas.


నీడేది

మొదటి బొమ్మ నీడను పట్టుకోండి


జవాబులు:

నీడేది: 3
పదాల పాము:
1.bat 2.tap 3.pig 4.girl 5.legs 6.sun 7.neck 8. kite 9.eleven 10. night 11.tea 12. actor 13. rope 14.empty 15.yellow 16.water 17.ring  18. goat 19. tattoo  20. orange 

చెప్పుకోండి చూద్దాం: అద్దం 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని