పుల్లలతో పిట్టపిల్ల!

పిట్టలు భలే అందంగా ఉంటాయి కదూ! పట్టుకునే లోపే తుర్రున పారిపోతుంటాయి. మరేం ఫర్లేదు.. ఈ రోజు మనమే కర్రపుల్లలతో చక్కని పిట్టపిల్లను తయారు చేసుకుందాం సరేనా!

Published : 17 Jun 2020 01:14 IST

పిట్టలు భలే అందంగా ఉంటాయి కదూ! పట్టుకునే లోపే తుర్రున పారిపోతుంటాయి. మరేం ఫర్లేదు.. ఈ రోజు మనమే కర్రపుల్లలతో చక్కని పిట్టపిల్లను తయారు చేసుకుందాం సరేనా!

ఏమేం కావాలి

* సన్నని, మెత్తని కర్రపుల్లలు

* జిగురు (గమ్‌)

* తెలుపు, నలుపు, పసుపు చార్టు పేపర్లు

* రంగుల చాక్‌పీసులు

ఎలా చేయాలంటే

* మెత్తటి కర్రపుల్లలు సేకరించి పెట్టుకోండి. చిన్న చిన్న మొక్కల ఎండుపుల్లలైతే బాగా సరిపోతాయి.

* వీటిలో కాస్త పొడవైన వాటిని ఎంచుకుని రెండు సమానంగా ఉండేలా కత్తిరించుకోవాలి.

* వీటికి ఎరుపు రంగు చాక్‌పీసుతో రంగు అద్దండి. ఇవి కాళ్లన్నమాట. మరి కొన్ని పుల్లలు తీసుకుని ఒకదానికి మరోటి జాగ్రత్తగా అతికించుకోండి.

* చివర్లో ఓ అయిదు పుల్లలు తీసుకుని ఒక్కోదానికి ఒక్కో రంగు చాక్‌పీసుతో రంగు వేసుకోండి.

* వీటిని పింఛంలా అతికించండి.

* తర్వాత వైట్‌ చార్టును గుండ్రంగా కత్తిరించుకోండి. దీనిపైన కాస్త చిన్నగా గుండ్రని ఆకారంలో కత్తిరించుకున్న నలుపు రంగు చార్టును అతికించుకోండి. ఇవి కళ్లన్నమాట.

* ఒకవేళ మీ దగ్గర నల్లచార్టు లేకపోతే.. మీరు తెల్లచార్టుపైన నల్లరంగు కూడా వేసుకోవచ్ఛు

* తర్వాత చిన్నగా త్రిభుజాకారంలో కత్తిరించి పెట్టుకున్న పసుపు రంగులోని చార్టును ముక్కులా అతికించుకోండి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని