తంతి తపాలా నీటిలో తేలేలా!

పోస్టాఫీసు ఎక్కడ ఉంటుంది? ఏ రోడ్డు పక్కనో.. వీధి చివరనో ఉంటుంది కానీ.. ఓ చోట మాత్రం నీళ్లలో ఉంది. అంటే తంతి తపాలా కార్యాలయం మునిగిపోయిందేమో అనుకునేరు. అది ఎంచక్కా తేలుతూ ఉంది. అది ఎక్కడో తెలుసుకోవాలని ఉందా!

Published : 02 Jul 2020 00:37 IST

పోస్టాఫీసు ఎక్కడ ఉంటుంది? ఏ రోడ్డు పక్కనో.. వీధి చివరనో ఉంటుంది కానీ.. ఓ చోట మాత్రం నీళ్లలో ఉంది. అంటే తంతి తపాలా కార్యాలయం మునిగిపోయిందేమో అనుకునేరు. అది ఎంచక్కా తేలుతూ ఉంది. అది ఎక్కడో తెలుసుకోవాలని ఉందా!

జమ్ముకశ్మీర్‌ శ్రీనగర్‌లోని దాల్‌ సరస్సులో ఉంది ఈ తేలే పోస్టాఫీసు. ఇది 2011లో ప్రారంభమైంది. దీన్ని కేవలం స్థానికులే కాదు. పెద్ద ఎత్తున పర్యాటకులూ సందర్శిస్తుంటారు. ఈ పోస్టాఫీసులో కేవలం మనియార్డర్లు, ఉత్తరాలకు సంబంధించిన సేవలే కాదు.. అంతర్జాలం, అంతర్జాతీయ ఫోన్‌కాల్స్‌ చేసుకునే సదుపాయమూ ఉంది. అంతే కాదండోయ్‌ ఇక్కడ తపాలా బిళ్లలకు సంబంధించి చిన్నపాటి మ్యూజియమూ ఉంది. ఇంకా స్మారక వస్తువులు అంటే తపాలా బిళ్లలు, పోస్టు కార్డులు, గ్రీటింగ్‌ కార్డులు అమ్మే దుకాణమూ ఉంది. మీకో విషయం తెలుసా.. ఇలా నీటిపై తేలియాడే పోస్టాఫీసు ప్రపంచంలో ఇంకెక్కడా లేదంట. మొత్తానికి భలే ఉంది కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని