ఈ చిన్నారి.. రాసింది పుస్తకం

హైదరాబాద్‌కు చెందిన కొంపళ్ల కశ్యప్‌-దీప దంపతులు ఉద్యోగరీత్యా బెంగళూరులో స్థిరపడ్డారు. వారి తొమ్మిదేళ్ల కూతురు కావ్య లాక్‌డౌన్‌లో ఇంట్లో ఉన్న అన్ని పుస్తకాలు చదివేసింది.

Published : 02 Sep 2020 00:28 IST

హైదరాబాద్‌కు చెందిన కొంపళ్ల కశ్యప్‌-దీప దంపతులు ఉద్యోగరీత్యా బెంగళూరులో స్థిరపడ్డారు. వారి తొమ్మిదేళ్ల కూతురు కావ్య లాక్‌డౌన్‌లో ఇంట్లో ఉన్న అన్ని పుస్తకాలు చదివేసింది. ఇంకా సమయం ఉండటంతో తండ్రి సూచన మేరకు ఊహాతీత కథలు రాయడం ప్రారంభించింది. అలా మొత్తం 13 వేల పదాలతో 110 పేజీల పుస్తకం పూర్తి చేసింది. దానికి ‘ద త్రీ అడ్వెంచర్స్‌ అట్‌ ఫంగళూరు’ అని పేరు పెట్టి డిజిటల్‌ రూపంలో విడుదల చేశారు. చిన్నారి కావ్య రాసిన పుస్తకం జులై చివరి రెండు వారాల్లో ఆన్‌లైన్‌ షాపింగ్‌ వేదిక అమెజాన్‌లో బెస్ట్‌ సెల్లర్‌గా నిలిచింది.

కల్పిత పాత్రలతో..

నీల్‌, నైనా అనే కల్పిత పాత్రలు.. ఫంగళూరు పేరుతో ఒక కొత్త పాఠశాలను ఆమె సృష్టించింది. వారి సాహసాలు, మాయా ప్రపంచంలో వారికి ఎదురైన సంఘటనలు, అక్కడ వారికి కనిపించిన రకరకాల ప్రాణులు తదితర అంశాలను పుస్తకంలో చిత్రాలతో సహా కథలుగా తీర్చిదిద్దింది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని