రంగురంగుల ఫొటో ఫ్రేమ్‌ చేసేద్దాం..!!

నేస్తాలూ.. స్మార్ట్‌ఫోన్లు వచ్చాక లెక్కలేనన్ని ఫొటోలు తీసుకుంటున్నాం కదా! ఏదైనా శుభకార్యానికి సంబంధించినవి అయితే ప్రత్యేకంగా ఆల్బమ్‌ చేయించుకొని, బీరువాలో భద్రంగా

Published : 01 Feb 2021 00:50 IST

చూడండి.. చెయ్యండి

నేస్తాలూ.. స్మార్ట్‌ఫోన్లు వచ్చాక లెక్కలేనన్ని ఫొటోలు తీసుకుంటున్నాం కదా! ఏదైనా శుభకార్యానికి సంబంధించినవి అయితే ప్రత్యేకంగా ఆల్బమ్‌ చేయించుకొని, బీరువాలో భద్రంగా దాచుకుంటాం. అందులో ఒకటో రెండో మనకు బాగా నచ్చినవి ఉంటాయి. అలాంటి వాటిని ఇంట్లో అందంగా అలంకరించుకోవాలని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అయితే, రంగురంగుల ఫొటోఫ్రేమ్‌ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..!!  
కావాల్సిన వస్తువులు
1. ఉన్ని ఉండలు(ఉలెన్‌ రోల్స్‌)
2. పాత సీడీలు, డెకరేషన్‌ రిబ్బన్‌
3. కత్తెర, జిగురు

ఎలా చేయాలంటే..
ముందుగా ఏదో ఒక రంగు ఉన్ని(ఉలెన్‌) ఉండను తీసుకోండి. దానిలో కొంతవరకు ఒక అట్టముక్కకు చుట్టి.. బయటకు తీసి.. వేరే దారంతో మధ్యలో కట్టాలి. ఫొటోలో చూపించినట్లు కత్తెరతో ఒక వైపు కత్తిరించి.. బాల్‌ మాదిరి గుండ్రంగా తయారు చేసుకోవాలి. ఇదే మాదిరి వేరే రంగువి మరికొన్ని ఉన్ని బంతులను సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు పాత సీడీ లేదా డీవీడీ తీసుకోవాలి. దాని చివరిలో ఉన్ని బంతులను జిగురుతో అతికించాలి. తర్వాత మీకు నచ్చిన ఫొటోను గుండ్రంగా కత్తిరించుకొని.. సీడీ మధ్యనున్న ఖాళీలో చక్కగా అతికించాలి. ఇప్పుడు డెకరేషన్‌ రిబ్బన్‌ను చిన్నగా కత్తిరించి ఫొటోలో మాదిరి హ్యాంగర్‌లా సీడీకి అంటిస్తే.. ఫ్రేమ్‌ సిద్ధం అయినట్లే. దీన్ని మీ గదిలోనో, హాల్లోనో అందంగా అలంకరిస్తే సరి. అంతేకాదండోయ్‌.. మీ స్నేహితుల పుట్టిన రోజు సందర్భంగా సీడీ మధ్యలో వాళ్ల ఫొటో అతికించి.. గిఫ్ట్‌గా ఇస్తే అంతా ఆశ్చర్యపోవాల్సిందే. భలే ఉంది కదూ! మీరూ ఒకసారి ప్రయత్నించండి మరి..!!  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు