నవ్వుల్‌.. నవ్వుల్‌..

మాస్కు ఇలా కూడా పనిచేస్తుందా? తల్లి: లిల్లీ.. నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు కూడా మాస్క్‌ పెట్టుకో...

Updated : 21 Mar 2021 01:01 IST

మాస్కు ఇలా కూడా పనిచేస్తుందా?

తల్లి: లిల్లీ.. నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు కూడా మాస్క్‌ పెట్టుకో.
లిల్లి: ఎందుకమ్మా?
తల్లి:  నన్ను ఏ పనీ చేసుకోనివ్వకుండా.. గంటకోసారి తినడానికి ఏదో ఒకటి అడుగుతూనే ఉన్నావుగా.

ఆలోచించాల్సిందే..

టీచర్‌: బంటీ.. వేలి మీద సూదితో పొడిస్తే రక్తం ఎందుకు వస్తుంది?
బంటి: కాలింగ్‌ బెల్‌ నొక్కితే ఇంట్లో నుంచి మనుషులు ఎందుకు వస్తారు?
టీచర్‌: కాలింగ్‌ బెల్‌ ఎవరు నొక్కారో చూడడానికి వస్తారు.
బంటి: అలాగే రక్తం కూడా  ఎవరు పొడిచారో చూడడానికి వస్తుంది టీచర్‌.
టీచర్‌: ఆఁఁ!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని