పాము కాదు.. పురుగే !

‘అమ్మో.. చూడగానే పామని తెలుస్తుంటే.. కాదంటారేంటి?’ అని ఆలోచిస్తున్నారా.. నిజంగా ఇది పాము కాదు. కేవలం గొంగళి పురుగు మాత్రమే! కానీ చూడటానికి అచ్చం పాములా కనిపిస్తుంది. మరి దీని విశేషాలు తెలుసుకుందామా!!

Published : 07 Apr 2021 01:13 IST

‘అమ్మో.. చూడగానే పామని తెలుస్తుంటే.. కాదంటారేంటి?’ అని ఆలోచిస్తున్నారా.. నిజంగా ఇది పాము కాదు. కేవలం గొంగళి పురుగు మాత్రమే! కానీ చూడటానికి అచ్చం పాములా కనిపిస్తుంది. మరి దీని విశేషాలు తెలుసుకుందామా!!
గొంగళిపురుగులు సీతాకోకచిలుకలుగా మారతాయని తెలుసు కదా! అలాంటి ఓ రకపు సీతాకోకచిలుక జాతికి చెందిన గొంగళిపురుగే ఇది. దీని గురించి కేవలం కొన్ని సంవత్సరాల క్రితమే ప్రపంచానికి తెలిసింది. అది కూడా ఓ వైల్డ్‌లైఫ్‌ ఫొటో గ్రాఫర్‌ వల్ల.
అవాక్కయ్యేలా..
ఆ ఫొటోగ్రాఫర్‌ తన వృత్తిలో భాగంగా దక్షిణాఫ్రికాలోని అడవుల్లో ఫొటోలు తీస్తున్నప్పుడు దీన్ని చూశాడు. తన కళ్లనే తాను నమ్మలేకపోయాడు. ఇది అచ్చుగుద్దినట్లు పాములానే కనిపించింది. కానీ పరిశీలనగా చూస్తే అప్పుడు అసలు విషయం తెలిసింది.. ఇది పాము కాదు కేవలం గొంగళిపురుగని!

కలిసొచ్చే రూపం!
పాములాంటి రూపం ఈ చిరుజీవికి భలే కలిసి వస్తోంది! దీన్ని తినడానికి వచ్చే చిన్న చిన్న పక్షులు భయంకరమైన దీని రూపం చూసి బెదిరిపోతున్నాయి. దీంతో ఇది ఎంచక్కా తన ప్రాణాలను కాపాడుకుంటోంది. మనుషులే అవాక్కవుతుంటే.. పాపం.. ఆ పక్షులు భ్రమ పడటంలో ఆశ్చర్యం లేదు కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని