చెట్టంతా జల్లెడ!

ఇక్కడున్న ఫొటోని చూడగానే ‘అరె ఎవరో ఈ చెట్టుకు రంధ్రాలు చేసిపెట్టినట్టున్నారే’ అనిపిస్తోంది కదూ. కానీ ఇది చేసింది ఎవరో తెలుసా? ఒక పక్షి. పేరు ఎకార్న్‌ వుడ్‌పెకర్‌. అదేనండీ వడ్రంగి పిట్టల్లో ఒక రకమైనదన్నమాట. దాదాపు పది అంగుళాల పొడవుతో, తెల్లని కళ్లతో, నల్లని రంగులో, తల మీద ఎర్రని మచ్చతో భలేగా ఉంటుందీ పిట్ట

Published : 13 Apr 2021 00:59 IST

ఇక్కడున్న ఫొటోని చూడగానే ‘అరె ఎవరో ఈ చెట్టుకు రంధ్రాలు చేసిపెట్టినట్టున్నారే’ అనిపిస్తోంది కదూ. కానీ ఇది చేసింది ఎవరో తెలుసా? ఒక పక్షి. పేరు ఎకార్న్‌ వుడ్‌పెకర్‌. అదేనండీ వడ్రంగి పిట్టల్లో ఒక రకమైనదన్నమాట. దాదాపు పది అంగుళాల పొడవుతో, తెల్లని కళ్లతో, నల్లని రంగులో, తల మీద ఎర్రని మచ్చతో భలేగా ఉంటుందీ పిట్ట. ముక్కే దీనికి అసలు ప్రత్యేకత. చాకులా పదునుగా ఉండే ఈ ముక్కుతోనే ఇది చెట్టుపై బోలెడన్ని రంధ్రాలు చేస్తుంది. చకచకా ముక్కుతో పొడిచేస్తూ కళాకారులు చెక్కినట్టే చెట్టుపై గుండ్రటి కన్నాలు చేస్తుంది. అలా పదో ఇరవయ్యో కాదు.... ఇంచుమించు 50 వేల వరకు. వేరే జీవులకు దొరక్కుండా ఎంచక్కా దాని ఆహారాన్ని అందులో దాచేసుకుంటుంది. పక్కపక్కనే వేల సంఖ్యలో ఉన్న ఈ రంధ్రాలు... జల్లెడలోని రంధ్రాల్లా భలే కనిపించేస్తాయి. చిన్న చిన్న పురుగుల్ని, కాయల్ని, విత్తనాల్ని, పండ్లనూ తినేస్తుంటుంది. ఇది ఎక్కువగా కాలిఫోర్నియా, చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఓక్‌ అడవుల్లో కనిపిస్తుంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని