బొమ్మలు గీసి.. రికార్డుల్లోకెక్కేసి!

లాక్‌డౌన్‌ సెలవుల్లో మనం ఎంచక్కా టీవీ చూస్తూనో, వీడియో గేమ్స్‌ ఆడుతూనో కాలం గడిపేసి ఉంటాం. కానీ ఓ చిన్నారి మాత్రం ఈ సమయాన్ని చక్కగా ఉపయోగించుకుని

Published : 13 Jul 2021 01:45 IST

లాక్‌డౌన్‌ సెలవుల్లో మనం ఎంచక్కా టీవీ చూస్తూనో, వీడియో గేమ్స్‌ ఆడుతూనో కాలం గడిపేసి ఉంటాం. కానీ ఓ చిన్నారి మాత్రం ఈ సమయాన్ని చక్కగా ఉపయోగించుకుని ఏకంగా ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో స్థానం సంపాదించుకుంది. మరి ఎలానో మనమూ తెలుసుకుందామా!

క్షిణకు తొమ్మిదేళ్లు. ప్రస్తుతం కేరళలోని తిరూర్‌లో నాలుగో తరగతి చదువుతోంది. అమ్మానాన్నలు నోబెల్‌, షైనీ ప్రోత్సాహంతో మూడేళ్ల వయసు నుంచే పెయింటింగ్స్‌ వేయడం మొదలు పెట్టింది. ఖాళీ సమయం దొరికితే చాలు కుంచె పట్టుకునేది. అంతేకాదు.. పెయింటింగ్‌కు సంబంధించి దాదాపు 1000 పుస్తకాలూ చదివేసింది. వాటి మీద రివ్యూలూ రాసింది.

పుస్తక సమీక్షలూ రాసి..
ఇలా ఈ చిన్నారి చిత్రకళలో మెలకువలు తెలుసుకుని స్వయంగా తనను తాను మెరుగుపరుచుకుంది. అంతేకాదు తాను చదివిన పుస్తకాల మీద ఏకంగా రివ్యూలు కూడా రాసింది. ఎక్కువ శాతం ఆయిల్‌ పాస్టల్స్‌ ఉపయోగించి బొమ్మలు వేసింది. ఇంకా వాటర్‌ కలర్‌, చార్‌కోల్‌ ఇలా అన్ని రకాల పెయింటింగ్స్‌ వేయగలదు. ఇంకేముంది.. ఇంత చిన్న వయసులోనే వేలకొద్దీ బొమ్మలు వేసి, రివ్యూలు రాయడంతో ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో స్థానం సంపాదించింది.

ఉడతా భక్తిగా..
మీకు మరో విషయం తెలుసా..! తను బొమ్మలు వేసి సంపాదించిన 20 వేల రూపాయల్ని కొవిడ్‌ బాధితులకు అందించమని ముఖ్యమంత్రి సహాయనిధికి ఇచ్చేసింది. భవిష్యత్తులో మరిన్ని బొమ్మలు వేస్తాననీ, పెయింటింగ్‌లో ప్రయోగాలు కూడా చేస్తాననీ చెబుతోంది ఈ బుడత. మొత్తానికి మన దక్షిణ నిజంగా గ్రేట్‌ కదూ! మనమూ తనకు అభినందనలు చెప్పేద్దామా మరి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని