టొమాటోకు మాటలొస్తే...!

ఏంటి నేస్తాలూ.. శీర్షిక చదివి అవాక్కవుతున్నారా?! అవును నిజంగా టొమాటో మాట్లాడగలదు. అంటే అచ్చంగా మనలా కాదనుకోండి! కొన్ని ఎలక్ట్రికల్‌ సిగ్నళ్లను మాత్రం మొక్కకు పంపగలదు. ‘అసలు అలా ఎందుకు పంపుతుంది. ఆ అవసరం టొమాటోకు ఎందుకు వస్తుంది?’ అనేగా మీ అనుమానం. అయితే ఇంకేం.. ఈ కథనం చదివేయండి మరి. మీకే తెలుస్తుంది...

Updated : 25 Jul 2021 01:14 IST

ఏంటి నేస్తాలూ.. శీర్షిక చదివి అవాక్కవుతున్నారా?! అవును నిజంగా టొమాటో మాట్లాడగలదు. అంటే అచ్చంగా మనలా కాదనుకోండి! కొన్ని ఎలక్ట్రికల్‌ సిగ్నళ్లను మాత్రం మొక్కకు పంపగలదు. ‘అసలు అలా ఎందుకు పంపుతుంది. ఆ అవసరం టొమాటోకు ఎందుకు వస్తుంది?’ అనేగా మీ అనుమానం. అయితే ఇంకేం.. ఈ కథనం చదివేయండి మరి. మీకే తెలుస్తుంది...

న అమ్మానాన్న పెరట్లోనో.. కుండీల్లోనో పెంచుకునే మొక్కలకు పురుగులు, తెగుళ్లు పడితే మందులు కొడతారు కదూ! అలాగే టొమాటో పండ్లు కూడా తమ మీద ఏమైనా కీటకాలు దాడి చేస్తే ఆ విషయాన్ని వెంటనే మొక్కకు చేరవేస్తాయి. అప్పుడు మొక్క కూడా ఆ హెచ్చరికలకు ప్రతిస్పందిస్తుంది. హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌, సూపర్‌ ఆక్సైడ్‌, కా లేస్‌, ఆస్కార్పేట్‌ పెరాక్సిడేస్‌, సూపరాక్సైడ్‌ వంటి పదార్థాలను వెంటనే విడుదల చేసే ప్రక్రియ ప్రారంభిస్తుంది. ఇవి కీటకాలు, సూక్ష్మజీవుల దాడి నుంచి కాండం, ఆకులు, పండ్లను కాపాడే ప్రయత్నం చేస్తాయి. మొక్క కణజాలం దెబ్బతినకుండా చూస్తాయి.

పోషకాలతోపాటు..

ఒక ఆకుకు ఏదైనా నష్టం వాటిల్లినప్పుడు మొక్కకున్న ఇతర ఆకులకు సంకేతాలు చేరతాయని శాస్త్రవేత్తలు గతంలోనే తేల్చారు. కానీ టొమాటో పండ్లు, కాయలపై ఏదైనా దాడి జరిగినా.. వెంటనే ఎలక్ట్రికల్‌ సిగ్నళ్లు మొక్కలకు చేరతాయని తాజా పరిశోధనల్లో తేలింది. మనకు నరాల వ్యవస్థ ఉన్నట్లే టొమాటో మొక్కలో కూడా ఆకులు, చిగుళ్లు, కొమ్మలు, ఫలాలను అనుసంధానం చేస్తూ చిన్న చిన్న నాళాల వంటి నిర్మాణాలుంటాయి. వేర్లు నేల నుంచి సేకరించిన పోషకాలను ఇవి మొక్కలోని ఇతర భాగాలకు అందేలా చేస్తాయి. కానీ ప్రస్తుతం ఈ నిర్మాణాలే ప్రమాద హెచ్చరికలనూ చేరవేయడానికి ఉపయోగపడుతున్నాయని పరిశోధకులు తేల్చారు. ఇవీ ఫ్రెండ్స్‌! ప్రస్తుతానికి విశేషాలు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని