దారేది?

నీరజ్‌ జావెలిన్‌ త్రో ప్రాక్టీస్‌ చేస్తున్నాడు. అతను విసిరిన ఈటె లక్ష్యం చేరేలా కాస్త సాయం చేయరూ!..

Published : 12 Aug 2021 00:44 IST

నీరజ్‌ జావెలిన్‌ త్రో ప్రాక్టీస్‌ చేస్తున్నాడు. అతను విసిరిన ఈటె లక్ష్యం చేరేలా కాస్త సాయం చేయరూ!


అక్షరాల ఆట!

కింది గళ్లలో కొన్ని అక్షరాలున్నాయి. వాటితో అడ్డంగా, నిలువుగా ఎన్ని పదాలు తయారు చేయగలరు. ఓసారి ప్రయత్నించి చూడండి.


ఇంతకీ నేనెవరిని?

నేనో నాలుగక్షరాల పదాన్ని. ‘ఆహారం’లో ఉంటాను. ‘హారం’లో ఉండను. ‘కన్ను’లో ఉంటాను. ‘మిన్ను’లో ఉండను. ‘తాడు’లో ఉంటాను. ‘గోడు’లో ఉండను. ‘రాయి’లో ఉంటాను. ‘రావి’లో ఉండను. ఇప్పటికైనా తెలిసిందా.. ఇంతకీ నేనెవరో?


చెప్పుకోండి చూద్దాం!

ఇక్కడ కొన్ని అసంపూర్తి వాక్యాలున్నాయి. ఖాళీల్లో ఏమి ఉండాలో చెప్పుకోండి చూద్దాం.

1. అభం -- తెలియని చిన్నపిల్లల్ని అలా హింసించకూడదు. అది చాలా పాపం తెలుసా!
2. వాళ్లిద్దరూ జీవితంలో ఎన్నో ఆటు-- ఎదుర్కొన్నారు.
3. ఇంకా ఎన్నాళ్లిలా ఎదుగూ---  లేకుండా చిరుద్యోగిగా బతికేస్తావు.
4. --నాలీ చేసుకుంటేనే కడుపు నిండేది.
5. ఎడారి దేశంలో --తిప్పలు లేకుండా, ఆకలితో ప్రాణాలు వదిలేసిన వాళ్లు ఎందరో ఉన్నారు.


పట్టికలో పదాలు

ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం.

ACE, SPIKE, OUT, BLOCK, COURT, NET, SET, SET ME, SIDE OUT, TIP, BUMP, CARRY, SERVE


ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి



నేను గీసిన బొమ్మ


జవాబులు

ఏది భిన్నం?: 1

చెప్పుకోండి చూద్దాం: 1.శుభం 2.పోట్లు 3.బొదుగూ 4.కూలీ 5.తిండీ

అక్షరాల ఆట: తూనీగ, ఈల, గోల, తూకం, గోవు, మల్లె, పది, నెత్తురు, సొత్తు, నెల, నెలవంక, పలక, కల, కోతి, మూతి, సొమ్ము, వంట, ఆట, కొమ్ము, కవి, వినోదం, నోము, ముక్కు, ఆవు, ఉక్కు, ఉలి, ఉరి, కొడవలి, వడ, మది, గది, ఆలి, పల్లె, నీరు, ఈగ

ఇంతకీ నేనెవరిని?: ఆకతాయి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని