నవ్వుల్‌.. నవ్వుల్‌..

టీచర్‌: శ్రమజీవి చీమ నుంచి నువ్వు ఏం తెలుసుకున్నావ్‌ చెప్పు చింటూ!

Updated : 05 Oct 2021 01:21 IST

ఇదీ నిజమే మరి!

టీచర్‌: శ్రమజీవి చీమ నుంచి నువ్వు ఏం తెలుసుకున్నావ్‌ చెప్పు చింటూ!

చింటు: అదో గజదొంగ టీచర్‌. మనం పంచదారలాంటి తీపి పదార్థాలు ఎక్కడ దాచినా.. వచ్చి దొంగతనం చేస్తుంది.

టీచర్‌: ఆఁ!!


మీరే చెప్పారని!

టీచర్‌: ఏంటి బంటీ.. స్కూలుకు అంతలా చిరిగిన చొక్కా వేసుకొచ్చావ్‌? చూసుకోలేదా?!

బంటి: లేదు టీచర్‌. ఆ చొక్కా బాగానే ఉండేది. నేనే చించుకొని వేసుకొని వచ్చా.

టీచర్‌: ఏ.. ఎందుకు?!

బంటి: చిరిగిన చొక్కా అయినా తొడుక్కో.. కానీ ఓ మంచి పుస్తకం కొనుక్కో అని నిన్న మీరే అన్నారుగా.. అందుకే!

టీచర్‌: ఆఁ!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని