నవ్వుల్‌.. నవ్వుల్‌..!

చింటు: ఏంటి బంటీ..! ఏదో సీరియస్‌గా రాస్తున్నావు.

Updated : 03 Nov 2021 00:29 IST

పెద్ద సమస్యే సుమీ!

చింటు: ఏంటి బంటీ..! ఏదో సీరియస్‌గా రాస్తున్నావు.

బంటి: మన బాలల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళదామని.. ఓ లేఖ రాస్తున్నా.

చింటు: ఇప్పుడు మనకు అంత సమస్య ఏం వచ్చింది బంటీ...!

బంటి: స్మార్ట్‌ఫోన్‌ను కలిగి ఉండటం కూడా బాలలహక్కుగా పరిగణించి.. మనకు స్వేచ్ఛను ప్రసాదించాలని..

చింటు: ఆఁ!!


నీకలా అర్థమైందా..!

టీచర్‌: నిజం నిప్పులాంటిది.. దీని అర్థమేంటో తెలుసా చిన్నీ..?

చిన్నీ: తెలుసు టీచర్‌.

టీచర్‌: గుడ్‌..! చెప్పు.

చిన్నీ: నిజం నిప్పులాంటిది. అది మనల్ని గాయపరుస్తుంది. అందుకే మనం నిజానికి ఎప్పుడూ దూరంగా ఉండాలి.

టీచర్‌: ఆఁ!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని