క్విజ్‌.. క్విజ్‌..!

అయిదు నిమిషాలకు ఎన్ని సెకన్లు?....

Updated : 13 Jan 2022 04:27 IST

1. అయిదు నిమిషాలకు ఎన్ని సెకన్లు?
2. ‘వైట్‌ హౌస్‌’ ఏ దేశంలో ఉంది?
3. అట్లాస్‌ పర్వతాలు ఏ ఖండంలో ఉన్నాయి?
4. ‘కుతుబ్‌ మినార్‌’ ఏ నగరంలో ఉంది?
5. ఈము పక్షులు ఏ దేశానికి చెందినవి?


వీరి వీరి గుమ్మడి పండు..!

ఈ కింద వాక్యాల్లో వ్యక్తుల పేర్లు దాగున్నాయి. కనిపెట్టండి చూద్దాం.
1. ఆ దుకాణంలో మధురమైన మిఠాయిలు లభిస్తాయి.
2. నాన్నా... బండి ఆపూ..! జరిగి కూర్చుంటాను కాస్త.
3. ఆ సాధువుకు మహిమలు ఉన్నాయని చెప్పుకొంటారు!
4. అది కాదుగానీ.. లడ్డూలు తినేసింది నువ్వే కదా!
5. ముందు నువ్వు ఆ.. దినుసులు ఇటు పట్టుకుని రా!


తమాషా ప్రశ్నలు!

1. క్యాలెండర్‌లో లేని వారం?
2. జీవితంలో తిండి పెట్టేది ఏంటి?
3. విడమరిచి చెప్పే వరం?


ఒక చిన్నమాట!

The greatest gift you can give your children are the roots of responsibility and the wings of independence.

బాధ్యతాయుతమైన స్వేచ్ఛే పిల్లలకు మనం అందించే అద్భుతమైన బహుమతి.


పట్టికలో పదాలు

ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం
సంబరం, అంబరం, గోపురం, బలపం, పండు, మేకపిల్ల, పెరుగు, పెనం, వనం, పవనం, గోల, అల, పలక, పలుకు, మెలకువ, వడ, వాలుజడ, ఆకాశం


కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.



నేను గీసిన బొమ్మ


జవాబులు

వీరి వీరి గుమ్మడి పండు..! : 1.మధు 2.పూజ 3.మహి, హిమ 4.నీల 5.ఆది

తమాషా ప్రశ్నలు: 1.పరివారం 2.జీతం 3.వివరం

క్విజ్‌.. క్విజ్‌.!: 1.300 సెకన్లు 2.అమెరికా 3.ఆఫ్రికా 4.దిల్లీ 5.ఆస్ట్రేలియా

కవలలేవి: 2, 3


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని