Mother milk: చనుబాల ఘనత
శిశువుకు తల్లిపాలే ఉత్తమ ఆహారం. దీనికి మించింది, సాటి మరోది లేనే లేదు. చనుబాలలో బిడ్డకు అవసరమైన ప్రొటీన్లు, కొవ్వులు, పిండి పదార్థాలు, విటమిన్లు, ఖనిజాల వంటి పోషకాలన్నీ సమపాళ్లలో ఉంటాయి.
శిశువుకు తల్లిపాలే ఉత్తమ ఆహారం. దీనికి మించింది, సాటి మరోది లేనే లేదు. చనుబాలలో బిడ్డకు అవసరమైన ప్రొటీన్లు, కొవ్వులు, పిండి పదార్థాలు, విటమిన్లు, ఖనిజాల వంటి పోషకాలన్నీ సమపాళ్లలో ఉంటాయి. అందుకే పుట్టిన తర్వాత వీలైనంత త్వరగా చనుబాలు పట్టటం ఆరంభించాలన్నది నిపుణుల మాట. ఆరు నెలల వరకు శిశువులకు తల్లిపాలు తప్ప మరే ఇతర ఆహారం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆరు నెలల తర్వాత అదనపు ఆహారం ఆరంభించినా రెండేళ్ల వరకూ తల్లిపాలు పట్టాలి. ఇది బిడ్డ ఎదుగుదలకు తప్పనిసరి. ఇంతటి విశిష్టత తల్లిపాలకు లభించటానికి కారణమేంటి? వీటి గొప్పతనమేంటి?
బిడ్డకే కాదు, తల్లికీ మేలే
చనుబాలతో బిడ్డకు ఆస్థమా, ఊబకాయం, టైప్ 1 మధుమేహం, చెవి ఇన్‌ఫెక్షన్లు, విరేచనాలు, వాంతుల వంటి జబ్బుల ముప్పు తగ్గుతుంది. నిద్రలో హఠాత్తుగా చనిపోయే అవకాశమూ తక్కువే. తల్లికి కూడా అధిక రక్తపోటు, మధుమేహం, అండాశయ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ ముప్పులు తగ్గుతాయి. చనుబాలు పట్టటం ద్వారా తల్లికీ బిడ్డకూ మధ్య అనోన్య బంధమూ ఏర్పడుతుంది.
రోగనిరోధక శక్తి బలోపేతం
చనుబాలు కేవలం పోషణకే కాదు.. బిడ్డకు అవసరమైన రక్షణనూ కల్పిస్తాయి. ఇవి హానికర సూక్ష్మక్రిముల నుంచీ కాపాడతాయి. శిశువుల్లో రోగనిరోధక వ్యవస్థ అప్పటికింకా అభివృద్ధి చెందదు. సూక్ష్మక్రిములతో పోరాడే యాంటీబాడీలు ఉండవు. చనుబాలతోనే తల్లి నుంచి బిడ్డకు యాంటీబాడీలు అందుతాయి. ఇవి సూక్ష్మక్రిములతో పోరాడటానికి తోడ్పడతాయి. రోగనిరోధక వ్యవస్థ అభివృద్ధి చెందేవరకూ రక్షణ కల్పిస్తాయి.
అవసరానికి తగ్గట్టుగా
కాన్పయ్యాక తొలి రెండు, మూడు రోజుల్లో వచ్చే ముర్రుపాలు చిక్కగా, కాస్త పసుపు పచ్చగా ఉంటాయి. వీటిల్లో ఇమ్యునోగ్లోబులిన్లు దండిగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తి పెంపొందటానికి తోడ్పడతాయి. ఐదారు రోజులకు పాలు కొద్దిగా పలుచబడతాయి. ఇందులో 90% నీరు, 8% పిండి పదార్థాలు (లాక్టోజ్), కొవ్వులు, ప్రొటీన్లు.. 2% ఖనిజాలు, విటమిన్లు ఉంటాయి. చాలావరకు శక్తి కొవ్వు, లాక్టోజ్ నుంచే లభిస్తాయి. సరిగ్గా బిడ్డకు కావాల్సింది ఇదే. ఇలా బిడ్డ అవసరాలకు అనుగుణంగా చనుబాలు మారుతుంటాయి. అంతేకాదు.. పడుతున్న ప్రతిసారీ పాలలోని పదార్థాల మోతాదులూ మారుతూ వస్తాయి. ముందుగా వచ్చే పాలు ఒకింత పలుచగా, ఎక్కువ లాక్టోజ్‌తో కూడుకొని ఉంటాయి. ఇవి బిడ్డ దాహం తీరుస్తాయి. అనంతరం కొవ్వుతో కూడిన పాలు వస్తాయి. అంటే ఎంత ఎక్కువసేపు పాలు పడితే అంత ఎక్కువ పోషకాలు లభిస్తాయన్నమాట. జీవగడియారాన్ని (సర్కేడియన్ రిథమ్) నియంత్రించే అంశాలూ తల్లిపాల నుంచి బిడ్డకు అందుతాయి.
కొవ్వులు ప్రత్యేకం
చనుబాలలో 200కు పైగా రకాల కొవ్వు ఆమ్లాలుంటాయి. ఒక్కోటీ ఒక్కోరకంగా ఆరోగ్యానికి, ఎదుగుదలకు తోడ్పడుతుంది. ఉదాహరణకు- షార్ట్ చెయిన్ కొవ్వులు సత్వరం శక్తిని అందిస్తాయి. ఇవి జీర్ణకోశ వ్యవస్థ ఏర్పడటానికీ తోడ్పడతాయి. కొన్ని మీడియమ్ చెయిన్ కొవ్వు ఆమ్లాలు రోగనిరోధకశక్తికీ దన్నుగా నిలుస్తాయి. గ్రూప్ బి స్ట్రెప్టోకాకస్ వంటి హానికారక సూక్ష్మ క్రిములను అణచివేస్తాయి స్ఫింగోలిపిడ్లనే కొవ్వులు మెదడులో నాడీకణాల వృద్ధికి తోడ్పడతాయి.
ఓలిగోశాక్రైడ్ల మేలు
చనుబాలలో ఓలిగోశాక్రైడ్లనే పిండి పదార్థాలుంటాయి. ఇవి ముర్రుపాలలో మరింత ఎక్కువగా ఉంటాయి. వీటిని శిశువులు జీర్ణం చేసుకోలేరు. కానీ పేగుల్లో మంచి బ్యాక్టీరియా వృద్ధికి బాగా తోడ్పడతాయి. ఇలా హానికర బ్యాక్టీరియా బారినపడకుండా కాపాడతాయి. విరేచనాలు, శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లు తలెత్తకుండా చూస్తాయి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
ISRO: విక్రమ్, ప్రజ్ఞాన్‌లతో కమ్యూనికేషన్‌కు యత్నం.. ఇస్రో ఏం చెప్పిందంటే!
-
Anantapuram: పాఠశాలలో దారుణం.. పుట్టిన రోజు నాడే చిన్నారి మృతి
-
Jagadish Reddy: సూర్యాపేటలో 26న ఐటీ జాబ్ మేళా: జగదీశ్‌రెడ్డి
-
Mayawati: బీఎస్పీ ఎంపీపై భాజపా ఎంపీ అభ్యంతరకర వ్యాఖ్యలు... మాయావతి రియాక్షన్ ఇదే!
-
Sidharth Luthra: సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా మరో ట్వీట్
-
Nene Naa Movie ott: ఓటీటీలోకి వచ్చేసిన రెజీనా మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?