కొవిడ్‌ తగ్గినా వాసన రాదేం?

కొవిడ్‌-19 నుంచి కోలుకున్నాకా నెలల తరబడీ కొందరికి ఎందుకు వాసన తిరిగి పూర్తిగా రావటం లేదు? ముక్కులో వాసనను పసిగట్టే భాగంలోని నాడీ కణాల మీద రోగనిరోధక శక్తి పదే పదే దాడి చేస్తుండటం, ఆ నాడీ కణాల సంఖ్య పడిపోవటం దీనికి కారణమని డ్యూక్‌ హెల్త్‌, హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌, యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా శాన్‌ డియాగో అధ్యయనంలో బయటపడింది.

Published : 27 Dec 2022 00:05 IST

కొవిడ్‌-19 నుంచి కోలుకున్నాకా నెలల తరబడీ కొందరికి ఎందుకు వాసన తిరిగి పూర్తిగా రావటం లేదు? ముక్కులో వాసనను పసిగట్టే భాగంలోని నాడీ కణాల మీద రోగనిరోధక శక్తి పదే పదే దాడి చేస్తుండటం, ఆ నాడీ కణాల సంఖ్య పడిపోవటం దీనికి కారణమని డ్యూక్‌ హెల్త్‌, హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌, యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా శాన్‌ డియాగో అధ్యయనంలో బయటపడింది. కొవిడ్‌-19 కారక వైరస్‌ అదేపనిగా దాడి చేయటం వల్ల వాసనలను పసిగట్టే భాగం తీవ్రంగా దెబ్బ తింటోందని, ఇది కోలుకోవటానికి చాలా ఎక్కువ సమయం పడుతోందని గుర్తించారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని