ఉప్పుతో అకాల మరణం

ఒంట్లో ద్రవాలు, ఖనిజ లవణాలు సమస్థితిలో ఉండటానికి ఉప్పు (సోడియం) ముఖ్యం. ఇది నాడుల పనితీరులోనూ పాలు పంచుకుంటుంది.

Published : 21 Mar 2023 00:22 IST

ఒంట్లో ద్రవాలు, ఖనిజ లవణాలు సమస్థితిలో ఉండటానికి ఉప్పు (సోడియం) ముఖ్యం. ఇది నాడుల పనితీరులోనూ పాలు పంచుకుంటుంది. కానీ పెద్దమొత్తంలో తీసుకుంటేనే సమస్య. గుండెజబ్బులు, పక్షవాతం, అకాల మరణం ముప్పులు పెరిగేలా చేస్తుంది. అందుకే ప్రపంచ ఆరోగ్యసంస్థ 2025 కల్లా సోడియం వాడకాన్ని 30% మేరకు తగ్గించాలని సంకల్పించింది. కానీ దీని విషయంలో కేవలం 5% సభ్యదేశాలే సమగ్ర విధానాలను రూపొందించాయని తాజా నివేదికలో పేర్కొంది. మనకు సోడియం చాలావరకు ఉప్పుతోనే లభిస్తుంది. టేస్టింగ్‌ సాల్ట్‌తోనూ (మోనోసోడియం గ్లుటమేట్‌) కొంతవరకు అందుతుంది. ఫాస్ట్‌ఫుడ్స్‌, చిప్స్‌, స్నాక్స్‌, సూప్స్‌, ఇన్‌స్టంట్‌ నూడుల్స్‌ వంటి అన్నింటిలోనూ ఇది ఉంటుంది. వీటిని తరచూ తింటే ఆరోగ్యాన్ని చేజేతులా దెబ్బతీసుకున్నట్టే. రోజుకు 5 గ్రాములకు (చెంచాడు) మించి ఉప్పు తీసుకోవద్దన్నది ప్రపంచ ఆరోగ్యసంస్థ సిఫారసు. ప్రపంచవ్యాప్తంగా సగటున దీని కన్నా 2 రెట్లు ఎక్కువే తింటున్నారు. కాబట్టే అప్రమత్తత అవసరమన్నది నిపుణుల సూచన.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు