Weight Loss: ఉపవాసంతో వేగంగా బరువు తగ్గుతుందా?

ఆహారం ద్వారా లభించే కేలరీలు, శరీరం ఖర్చు చేసుకునే కేలరీలను బట్టి బరువు ఆధారపడి ఉంటుంది. నిర్ణీత (ఇంటర్‌మిటెంట్‌) ఉపవాసంతో కేలరీల లోపం ఏర్పడుతుంది. అంటే తీసుకునే కేలరీల కన్నా ఎక్కువ ఖర్చవుతాయన్నమాట.

Updated : 15 Nov 2022 08:51 IST

హారం ద్వారా లభించే కేలరీలు, శరీరం ఖర్చు చేసుకునే కేలరీలను బట్టి బరువు ఆధారపడి ఉంటుంది. నిర్ణీత (ఇంటర్‌మిటెంట్‌) ఉపవాసంతో కేలరీల లోపం ఏర్పడుతుంది. అంటే తీసుకునే కేలరీల కన్నా ఎక్కువ ఖర్చవుతాయన్నమాట. సాధారణంగా మనం రోజుకు 4-5 సార్లు భోజనం, చిరుతిళ్లు (సుమారు 2,500 నుంచి 3వేల కేలరీలు) తింటుంటాం. నిర్ణీత ఉపవాసంతో తీసుకునే కేలరీలు తగ్గుతాయి. కాబట్టి బరువూ తగ్గుతుంది. అదీ భోజనం చేసే సమయంలో ఎక్కువగా తినకపోతేనే. 7,700 కేలరీల లోపంతో కిలో బరువు తగ్గుతుంది. దీన్ని ఉపవాసంతోనే కాదు, భోజనం పరిమాణాన్ని తగ్గించుకోవటం ద్వారానూ సాధించొచ్చు. దీనికి వ్యాయామం కూడా తోడైతే మరింత వేగంగా బరువును తగ్గించుకోవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని