మొదటి పాపకు గుండెజబ్బు..
మళ్లీ గర్భధారణకు ప్రయత్నించొచ్చా?
సమస్య - సలహా
సమస్య: నా వయసు 22 సంవత్సరాలు. నాకు 19 ఏళ్ల వయసులో పెళ్లి అయ్యింది. పెళ్లి అయిన ఏడాదికి పాప పుట్టింది. కానీ పాపకు గుండె జబ్బు ఉంది. జన్యు సమస్య అని డాక్టర్ చెప్పారు. మాది మేనరికం పెళ్లి కాదు. ఇప్పుడు రెండేళ్ల తర్వాత గర్భధారణ కోసం ప్రయత్నిస్తున్నాం. మున్ముందు ఏదైనా ఇబ్బంది తలెత్తుతుందా?
సలహా: మీ పాపకు పుట్టుకతోనే గుండె జబ్బు ఉందని అంటున్నారు. జన్యువుల్లో మార్పుల వల్ల తలెత్తే కొన్ని గుండెజబ్బులు తర్వాత పుట్టే పిల్లలకూ వచ్చే అవకాశముంది. కాబట్టి ముందుగానే జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ముందుగా మీ పాపకు వచ్చిన గుండె జబ్బు ఏంటనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం మీకు, మీ భర్తకు, మీ పాపకు.. ముగ్గురికీ సంపూర్ణ జన్యు పరీక్ష (వోల్ ఎగ్జోమ్ సీక్వెన్సింగ్) చేయాల్సి ఉంటుంది. కాస్త ఖరీదైనదే అయినా ఇందులో జన్యువుల్లో మార్పులేవైనా ఉంటే బయటపడతాయి. మీకు గానీ మీ భర్తకు గానీ గుండెజబ్బుకు దారితీసే జన్యు మార్పులు ఉన్నట్టయితే కృత్రిమ గర్భధారణకు ప్రయత్నించటం మేలు. ఇందులో రకరకాల పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. మీ అవసరాన్ని బట్టి డాక్టర్లు తగిన పద్ధతిని సూచిస్తారు. ఒకవేళ జన్యుమార్పులేవీ లేకపోతే మామూలుగానే గర్భధారణకు ప్రయత్నించొచ్చు. తల్లిదండ్రుల్లో కొత్తగా జన్యువుల్లో మార్పులు తలెత్తినా అవి బిడ్డకు కచ్చితంగా రావాలనేమీ లేదు. అయితే మీరు చిన్న వయసులోనే పెళ్లి అయ్యిందని చెబుతున్నారు. అందువల్ల మీకు, మీ భర్తకు విటమిన్ల లోపం ఏమైనా ఉందేమో కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి12, విటమిన్ డి మోతాదులు తెలుసుకోవటం చాలా అవసరం. ఇవి లోపిస్తే పిల్లల్లో జన్యు లోపాలు తలెత్తే అవకాశముంది. కాబట్టి విటమిన్ల మోతాదులు తక్కువగా ఉంటే మాత్రలు వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీ భర్తకు పొగ తాగటం, మద్యం వంటి అలవాట్లుంటే వెంటనే మానెయ్యాలి. ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకున్న తర్వాతే గర్భధారణకు ప్రయత్నించాలి. కాబట్టి మీరు పిల్లల గుండె సమస్యల నిపుణులను సంప్రదిస్తే.. తగు పరీక్షలు చేసి సలహా ఇస్తారు.
మీ ఆరోగ్య సమస్యలను సందేహాలను పంపాల్సిన ఈమెయిల్: sukhi@eenadu.in
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Social Look: సిల్క్స్మితలా దివి పోజు.. మేఘ ‘ప్రేమదేశం’ అప్పుడే
-
General News
Top 10 Budget Stories: కేంద్ర బడ్జెట్ - 2023 ప్రత్యేక కథనాలు!
-
Politics News
Nellore: వైకాపాలో మరో అసంతృప్త గళం.. పరిశీలకుడిపై నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే
-
Movies News
Kichcha Sudeep: ఆమె చేసిన త్యాగాల వల్లే నేను ఇక్కడ ఉన్నా: కిచ్చా సుదీప్
-
Sports News
ICC Rankings: కెరీర్లో అత్యుత్తమ రేటింగ్ పాయింట్లను అందుకున్న సూర్యకుమార్
-
India News
UPSC Jobs: యూపీఎస్సీ సివిల్స్ నోటిఫికేషన్ విడుదల.. పోస్టులెన్నంటే?