ఊబకాయ విరేచనాలు!

ఊబకాయం పెద్ద సమస్య. దీంతో గుండెజబ్బులు, మధుమేహం, జీర్ణకోశ సమస్యలు, కీళ్ల నొప్పుల వంటి ఎన్నెన్నో జబ్బులు ముంచుకొస్తాయన్నది తెలిసిందే. ఇది విరేచనాల సమస్యకూ దారితీస్తుందంటే నమ్ముతారా? శరీర ఎత్తు, బరువుల నిష్పత్తి (బీఎంఐ) మితిమీరిన వారికి విడవకుండా వేధించే

Updated : 24 Sep 2019 00:27 IST

బకాయం పెద్ద సమస్య. దీంతో గుండెజబ్బులు, మధుమేహం, జీర్ణకోశ సమస్యలు, కీళ్ల నొప్పుల వంటి ఎన్నెన్నో జబ్బులు ముంచుకొస్తాయన్నది తెలిసిందే. ఇది విరేచనాల సమస్యకూ దారితీస్తుందంటే నమ్ముతారా? శరీర ఎత్తు, బరువుల నిష్పత్తి (బీఎంఐ) మితిమీరిన వారికి విడవకుండా వేధించే విరేచనాల సమస్య పట్టుకునే అవకాశం 60% ఎక్కువగా ఉంటున్నట్టు తాజాగా బయటపడింది మరి. ఆహార అలవాట్లు, జీవనశైలి, ఇతరత్రా జబ్బులను పక్కనపెట్టి చూసినా ‘ఊబకాయ విరేచనాల’ ముప్పు ఉంటుండటం గమనార్హం. దీనికి కారణమేంటన్నది స్పష్టంగా తెలియరాలేదు గానీ పేగుల్లో స్వల్ప స్థాయిలో కొనసాగే వాపు ప్రక్రియ దీనికి దోహదం చేస్తుండొచ్చన్నది పరిశోధకుల భావన. ఊబకాయుల్లో విరేచనాలు, మలబద్ధకం వంటి సమస్యలకు కొత్త చికిత్సలు రూపొందించటానికి ఈ అధ్యయన ఫలితాలు ఉపయోగపడగలవని ఆశిస్తున్నారు. ఊబకాయం రావటానికి కారణమయ్యే జన్యువుల విషయంలో మనమేమీ చేయలేకపోవచ్చు గానీ జీవనశైలి మార్పులతో పెరిగే బరువును కచ్చితంగా అదుపు చేసుకోవచ్చు. కొవ్వు పదార్థాలు తగ్గించటం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం, కంటి నిండా నిద్ర పోవటం, ఒత్తిడిని తగ్గించుకోవటం ద్వారా దీన్ని నివారించుకునే మార్గం లేకపోలేదు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని