శాక ప్రొటీన్‌ చాలా మేలు!

ఆయుష్షు పెంచుకోవాలని అనుకుంటున్నారా? మాంసాహారం కాస్త తగ్గించండి. బదులుగా గింజపప్పులు (బాదం, అక్రోట్లు, పిస్తా వంటివి), సోయా, పప్పులు, చిక్కుళ్లు తీసుకోండి. వృక్ష సంబంధ ప్రొటీన్లతో నిండిన ఇలాంటివి ఎక్కువగా తినేవారి జీవనకాలం పెరుగుతున్నట్టు తేలింది మరి

Updated : 24 Sep 2019 00:27 IST

యుష్షు పెంచుకోవాలని అనుకుంటున్నారా? మాంసాహారం కాస్త తగ్గించండి. బదులుగా గింజపప్పులు (బాదం, అక్రోట్లు, పిస్తా వంటివి), సోయా, పప్పులు, చిక్కుళ్లు తీసుకోండి. వృక్ష సంబంధ ప్రొటీన్లతో నిండిన ఇలాంటివి ఎక్కువగా తినేవారి జీవనకాలం పెరుగుతున్నట్టు తేలింది మరి. వృక్ష ప్రొటీన్ల వాడకం, మరణం ముప్పునకూ మధ్య గల సంబంధంపై జపాన్‌ పరిశోధకులు ఇటీవల ఒక అధ్యయనం నిర్వహించారు. సుమారు 20 ఏళ్ల పాటు 70వేలకు పైగా మందిని పరిశీలించి ఆసక్తికరమైన విషయాలను గుర్తించారు. శాకాహారంతో లభించే మాంసకృత్తులు ఎక్కువగా తీసుకున్నవారికి ఎలాంటి కారణంతోనైనా మరణించే ముప్పు 13% తక్కువగా ఉంటుండటం గమనార్హం. తక్కువ వృక్ష ప్రొటీన్లు తిన్నవారితో పోలిస్తే, ఎక్కువగా తీసుకున్నవారికి గుండెజబ్బుతో మరణించే ముప్పు 16% తక్కువగానూ ఉంటోంది. మాంసం వాడకాన్ని 3% తగ్గించినా చాలు. అన్నిరకాల కారణాలతో సంభవించే మరణం ముప్పు 34% తగ్గుముఖం పడుతుండగా.. క్యాన్సర్‌ మరణాల ముప్పు 39%, గుండెజబ్బు మరణాల ముప్పు 42% తగ్గుతుండటం విశేషం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని