తల్లి ప్రేమ ప్రభావం అనంతం!

బిడ్డ మీద తల్లి చూపే ప్రేమ, ఆప్యాయతల గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. వీటి ప్రభావం బాల్యానికే పరిమితం అనుకుంటే పొరపాటే. జీవితాంతమూ వెన్నంటి వస్తాయి!

Published : 08 Oct 2019 00:59 IST

బిడ్డ మీద తల్లి చూపే ప్రేమ, ఆప్యాయతల గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. వీటి ప్రభావం బాల్యానికే పరిమితం అనుకుంటే పొరపాటే. జీవితాంతమూ వెన్నంటి వస్తాయి! సుమారు 4వేల మందిని పరిశీలించి పరిశోధకులు ఈ విషయాన్ని గుర్తించారు. చిన్నప్పుడు తల్లి తమతో మాట్లాడుతున్నప్పుడు ఎంత ఆనందంగా కనిపించేది? ఎన్నిసార్లు హత్తుకునేది? వంటి ప్రశ్నలతో వారి మధ్య అనుబంధాన్ని అంచనా వేశారు. అనంతరం 18 ఏళ్ల పాటు పరిశీలించారు. తల్లి ప్రేమానురాగాలను బాగా పొందిన పిల్లలు ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం ఎక్కువగా ఉంటున్నట్టు గుర్తించారు. అంతేకాదు.. వైవాహిక జీవితంలో మరింత ఎక్కువ ఆనందాన్ని ఆస్వాదిస్తున్నట్టూ, మతిమరుపు సమస్యలు తక్కువగా ఉంటున్నట్టూ తేలటం విశేషం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని