వినికిడి సాధనం వాడినా కానీ..

నా వయసు 59 సంవత్సరాలు. పదేళ్ల క్రితం ఆటో ప్రమాదంలో గాయపడ్డాను. అప్పట్నుంచీ క్రమంగా వినికిడి తగ్గుతూ వస్తోంది. ఇప్పుడు 90% వరకు వినికిడిలోపం ఉంది.

Published : 22 Oct 2019 00:38 IST

సమస్య - సలహా

సమస్య: నా వయసు 59 సంవత్సరాలు. పదేళ్ల క్రితం ఆటో ప్రమాదంలో గాయపడ్డాను. అప్పట్నుంచీ క్రమంగా వినికిడి తగ్గుతూ వస్తోంది. ఇప్పుడు 90% వరకు వినికిడిలోపం ఉంది. వినికిడి సాధనాన్ని పెట్టుకుంటున్నా మాటలు స్పష్టంగా వినిపించటం లేదు. పాటల్లో సంగీతం బాగానే వినిపిస్తుంది. కానీ మాట అర్థం కాదు. దీంతో ఎవరితోనూ మాట్లాడలేకపోతున్నాను. పరిష్కారం తెలపగలరు.

- ఆర్‌. ఆది నారాయణ, తండ్లాం, శ్రీకాకుళం జిల్లా

సలహా: వినికిడి లోపం 75% దాటితే వినికిడి సాధనంతో అంత ఉపయోగం ఉండదు. మీరు వినికిడి లోపం 90% వరకూ ఉందని అంటున్నారు. మీకు కాక్లియర్‌ ఇంప్లాంట్‌ అమర్చటం ఒక్కటే పరిష్కారం. కాకపోతే దీనికి ఎక్కువ ఖర్చు అవుతుంది. కాక్లియర్‌ ఇంప్లాంట్‌ అమర్చిన తర్వాత 2-3 నెలల వరకు సహాయ చికిత్సలూ (రిహబిలిటేషన్‌) అవసరమవుతాయి. శబ్దాలు ఎక్కువ తక్కువ స్థాయుల్లో కాకుండా సమాన స్థాయిలో వినిపించటానికి అనుగుణంగా పరికరాన్ని సవరించాల్సి (మ్యాపింగ్‌) ఉంటుంది. కాక్లియర్‌ ఇంప్లాంట్‌కు, శస్త్రచికిత్సకు, సహాయ చికిత్స.. అన్నింటికీ కలిపి కనీసం      రూ.8 లక్షలు ఖర్చవుతుంది. ఒక చెవిలో ఇంప్లాంట్‌ అమర్చుకున్నా సరిపోతుంది. జనరల్‌ అనస్థీషియాను తట్టుకోలేని స్థితిలో ఉన్నవారికి అవసరమైతే చెవి దగ్గరే మత్తుమందు (లోకల్‌ అనస్థీషియా) ఇచ్చి దీన్ని అమర్చొచ్చు. మీరు వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవటం మంచిది.


మీ ఆరోగ్య సమస్యలను, సందేహాలను పంపాల్సిన చిరునామా
సమస్య - సలహా సుఖీభవ ఈనాడు ప్రధాన కార్యాలయం, రామోజీ ఫిలింసిటీ, హైదరాబాద్‌ - 501 512
email: sukhi@eenadu.net


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని