భోజన కాలంపరిమితం

రక్తపోటు, గ్లూకోజు, చెడ్డ కొలెస్ట్రాల్‌, ట్రైగ్లిజరైడ్లు, బొజ్జ.. అన్నీ ఒకే ఉపాయంతో తగ్గాలని కోరుకుంటున్నారా?...

Published : 24 Dec 2019 00:07 IST

క్తపోటు, గ్లూకోజు, చెడ్డ కొలెస్ట్రాల్‌, ట్రైగ్లిజరైడ్లు, బొజ్జ.. అన్నీ ఒకే ఉపాయంతో తగ్గాలని కోరుకుంటున్నారా? అయితే రోజులో 14 గంటల పాటు ఏమీ తినకుండా ఉపవాసం ఉండండి. కావాలంటే నీళ్లు తాగొచ్ఛు మిగతా 10 గంటల్లో మీకు ఇష్టం వచ్చిన అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం తీసుకోండి. బొజ్జ, రక్తపోటు, రక్తంలో గ్లూకోజు, కొలెస్ట్రాల్‌ ఎక్కువగా ఉండటమనే జీవక్రియల రుగ్మత (మెటబాలిక్‌ సిండ్రోమ్‌) గలవారు ఇలాంటి పద్ధతిని పాటిస్తే మంచి ఫలితం కనిపిస్తున్నట్టు అమెరికాలోని సాల్క్‌ ఇన్‌స్టిట్యూట్‌ పరిశోధకులు గుర్తించారు. దీంతో రాత్రిపూట శరీరం విశ్రాంతి పొందటానికి, కోలుకోవటానికి తగు సమయం లభిస్తుంది. ఫలితంగా బరువు, బొజ్జ, కొలెస్ట్రాల్‌, రక్తపోటు, పరగడుపున గ్లూకోజు మోతాదులు తగ్గుముఖం పడతాయి. దీన్ని పాటించాలని అనుకునేవారు ముందుగా డాక్టర్‌ సలహా తీసుకోవటం తప్పనిసరి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని