కాలుష్య భూతానికి భుజంగాసనం

ప్రస్తుతం వాయు కాలుష్యంతో పాటు శ్వాస సమస్యలూ పెరిగిపోతున్నాయి. వీటికి భుజంగాసనంతో కళ్లెం వేసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఛాతీని, ఊపిరితిత్తులను బలోపేతం చేస్తుంది.

Published : 02 Jul 2019 00:36 IST

ప్రస్తుతం వాయు కాలుష్యంతో పాటు శ్వాస సమస్యలూ పెరిగిపోతున్నాయి. వీటికి భుజంగాసనంతో కళ్లెం వేసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఛాతీని, ఊపిరితిత్తులను బలోపేతం చేస్తుంది. అంతేకాదు, గుండెకూ బలాన్ని చేకూరుస్తుంది. పొట్టలోని కొవ్వును కరిగిస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. అయితే ఈ ఆసనాన్ని అల్సర్లు, హెర్నియా గలవారు, గర్భిణులు వేయకూడదు.

ఎలా చేయాలి?
బోర్లా పడుకొని శరీరం మొత్తాన్ని పూర్తిగా సాగదీయాలి. రెండు పాదాల వేళ్లు, మడమలు తాకేలా చూసుకోవాలి. అరచేతులను ఛాతీ పక్కలకు తీసుకొచ్చి, నేలకు ఆనించాలి. శ్వాసను తీసుకుంటూ నెమ్మదిగా తల, ఛాతీని పైకి లేపాలి. మోచేతులు నేలకు ఆని ఉండేలా చూసుకోవాలి. కొద్దిసేపయ్యాక శ్వాసను వదులుతూ తిరిగి మామూలు స్థితికి రావాలి.
ఇది అలవడిన తర్వాత మరింత ముందుకు సాగొచ్చు. ఈ దశలో ఛాతీకి దగ్గరగా అరచేతులను నేలకు ఆనించాలి. బలాన్ని చేతులపై మోపుతూ.. శ్వాసను తీసుకుంటూ తల, ఛాతీ, కడుపు భాగాన్ని పైకి లేపాలి. కొద్దిసేపు అలాగే ఉండి శ్వాసను వదులుతూ తిరిగి మామూలు స్థితికి రావాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని