మందులేనా?మంచి తిండీ ముఖ్యమే!

ఆసుపత్రిలో చేరినవారికి మందులు మాత్రమే కాదు, తిండీ ముఖ్యమే. అది ఆయా వ్యక్తుల అవసరాలకు అనుగుణంగా...

Published : 14 Jan 2020 00:08 IST

సుపత్రిలో చేరినవారికి మందులు మాత్రమే కాదు, తిండీ ముఖ్యమే. అది ఆయా వ్యక్తుల అవసరాలకు అనుగుణంగా ఉన్నదైతే ఇంకా మంచిదని తాజా అధ్యయనం ఒకటి పేర్కొంటోంది. చికిత్స ఫలితాలు మెరుగుపడటానికి, జబ్బుల దుష్ప్రభావాలు తగ్గటానికి, త్వరగా కోలుకోవటానికిది దోహదం చేస్తుంది. ఏదైనా జబ్బుతో ఆసుపత్రిలో చేరినప్పుడు తినటానికి, తాగటానికి చాలామంది ఇబ్బంది పడుతుంటారు. దీంతో శరీరానికి తగినంతగా ప్రొటీన్లు, శక్తి అందవు. ఫలితంగా చికిత్స తీసుకుంటున్నా అంతగా గుణం కనిపించకపోవచ్ఛు జబ్బు ముదురుతుండొచ్ఛు దుష్ప్రభావాల ముప్పు పెరగొచ్ఛు కొన్నిసార్లు ప్రాణాపాయానికీ దారితీయొచ్ఛు అందుకే పోషణలోపం తలెత్తకుండా, బాధితులకు అవసరాలకు అనుగుణమైన ఆహారం ఇవ్వటానికి ప్రాధాన్యం పెరుగుతోంది. ఇలాంటి ఆహారంతో లభించే ప్రయోజనాల మీద ఇప్పటివరకూ పెద్దగా అధ్యయనాలు సాగలేదు. ఈ నేపథ్యంలో స్విట్జర్లాండ్‌ ఆసుపత్రుల్లో పరిశోధకులు ఒక అధ్యయనం నిర్వహించారు. ఆసుపత్రి క్యాంటీన్లలో లభించే మామూలు ఆహారం తిన్నవారితో పోలిస్తే అవసరాలకు తగిన ఆహారం తీసుకున్నవారిలో చికిత్స ఫలితాలు మరింత మెరుగ్గా ఉండటం విశేషం. దుష్ప్రభావాలు, మరణాలు సైతం తగ్గటం గమనార్హం. తీవ్రమైన జబ్బులతో బాధపడేవారి విషయంలో ఆహార చికిత్సకూ ప్రాధాన్యం ఇవ్వటం ఎంతైనా అవసరమని ఫలితాలు సూచిస్తున్నాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు