Published : 18 Feb 2020 01:39 IST

వ్యాయామ ‘మధు’రం!

వ్యాయామం ఎవరికైనా అవసరమే. మధుమేహులకు ఇది మరింత అవసరం. మధుమేహ నియంత్రణలో మందులు, ఆహార నియమాల మాదిరిగా వ్యాయామమూ ఎంతగానో తోడ్పడుతుంది. వ్యాయామంతో..
* రక్తంలో గ్లూకోజు మోతాదులు మెరుగవుతాయి
* శారీరక సామర్థ్యం ఇనుమడిస్తుంది. కదలికలు సాఫీగా సాగుతాయి
* తీసుకోవాల్సిన ఇన్సులిన్‌ మోతాదు తగ్గుతుంది
* రక్త ప్రసరణ బాగా జరుగుతుంది
* గుండె జబ్బుల ముప్పు తగ్గుముఖం పడుతుంది
* అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది
* బరువు తగ్గుతుంది, నియంత్రణలో ఉంటుంది
* హాయిగా ఉన్నామనే భావన కలుగుతుంది
* ఒత్తిడి తగ్గుతుంది


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని