ఆలోచనల మీద బొజ్జ ‘భారం’

పెద్ద వయసులో ఆలోచనల సామర్థ్యం తగ్గకూడదని భావిస్తున్నారా? అయితే ఇప్పట్నుంచే బొజ్జ పెరగకుండా చూసుకోండి. బొజ్జ పెద్దగా, కండర మోతాదు తక్కువగా గలవారిలో సమయానికి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకునే నైపుణ్యం తగ్గుతున్నట్టు బ్రిటన్‌ సంస్థ అధ్యయనంలో

Published : 18 Feb 2020 01:26 IST

పెద్ద వయసులో ఆలోచనల సామర్థ్యం తగ్గకూడదని భావిస్తున్నారా? అయితే ఇప్పట్నుంచే బొజ్జ పెరగకుండా చూసుకోండి. బొజ్జ పెద్దగా, కండర మోతాదు తక్కువగా గలవారిలో సమయానికి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకునే నైపుణ్యం తగ్గుతున్నట్టు బ్రిటన్‌ సంస్థ అధ్యయనంలో బయటపడింది మరి. వృద్ధాప్యం ముంచుకొస్తున్నకొద్దీ విషయగ్రహణ సామర్థ్యం తగ్గటంలో ఏళ్ల కన్నా శారీరక వయసే (కొవ్వు, కండరాల మోతాదులు) కీలకపాత్ర పోషిస్తోందని పరిశోధకులు చెబుతున్నారు. ఇందులో రోగనిరోధక వ్యవస్థ సైతం ప్రభావం చూపుతుండటం గమనార్హం. శరీర ఎత్తు బరువుల నిష్పత్తి (బీఎంఐ) ఎక్కువగా గలవారి రక్తంలో తెల్లరక్త కణాల వంటివి కాస్త చురుకుగా పనిచేస్తుంటాయి. ఇవి మెదడులో రోగనిరోధకవ్యవస్థను ప్రేరేపించి విషయగ్రహణతో ముడిపడిన సమస్యలకు దారితీస్తుంటాయి. కాబట్టి ముందు నుంచే సమతులాహారం తీసుకుంటూ.. వేగంగా నడవటం, సైకిల్‌ తొక్కటం, ఈత కొట్టటం వంటి వ్యాయామాలు చేస్తూ బొజ్జ పెరగకుండా చూసుకోవటం మంచిది. ఇది శారీరక పటుత్వానికే కాదు, మానసిక బలానికీ దోహదం చేస్తుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని