పక్షవాతానికి మతిమరుపు ఆజ్యం!

అసలే పక్షవాతం. ఆపై అల్జీమర్స్‌, మధుమేహం. ఇంకేముంది అగ్నికి ఆజ్యం తోడైనట్టే. మెదడులో రక్తనాళం చిట్లి, రక్తస్రావం కావటం (హెమరేజిక్‌) వల్ల తలెత్తే పక్షవాతానికి తీవ్ర మతిమరుపును తెచ్చిపెట్టే అల్జీమర్స్‌, మధుమేహమూ తోడైతే సమస్య మరింత తీవ్రంగా,

Updated : 25 Feb 2020 01:57 IST

సలే పక్షవాతం. ఆపై అల్జీమర్స్‌, మధుమేహం. ఇంకేముంది అగ్నికి ఆజ్యం తోడైనట్టే. మెదడులో రక్తనాళం చిట్లి, రక్తస్రావం కావటం (హెమరేజిక్‌) వల్ల తలెత్తే పక్షవాతానికి తీవ్ర మతిమరుపును తెచ్చిపెట్టే అల్జీమర్స్‌, మధుమేహమూ తోడైతే సమస్య మరింత తీవ్రంగా, సంక్లిష్టంగా తయారవుతోందని తాజా అధ్యయనం ఒకటి హెచ్చరిస్తోంది. ఇలాంటివారిలో 75% మంది మరణించటమో లేదంటే సాంత్వన చికిత్స అవసరపడటమో లేదా ఎక్కువ కాలం ఆసుపత్రిలో ఉండాల్సి రావటమో జరుగుతుండటం గమనార్హం. అల్జీమర్స్‌, మధుమేహం లేని పక్షవాతం బాధితుల్లోనైతే 39% మందికి మాత్రమే ఇలాంటి పరిస్థితి ఎదురవుతుండటం గమనార్హం. ఒక్క మధుమేహమే గలవారిలోనైతే 42% మంది, అల్జీమర్స్‌ మాత్రమే గలవారిలోనైతే 62% మందికి పక్షవాతం తీవ్ర శాపంగా పరిణమిస్తోందని పరిశోధకులు చెబుతున్నారు. పక్షవాత చికిత్సల విషయంలో ఒకటి కన్నా  ఎక్కువ జబ్బులు ఉండటాన్ని నిశితంగా పరిశీలించాల్సిన అవసరముందని ఈ అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయి. మెదడులో రక్తస్రావంతో తలెత్తే పక్షవాతానికి ప్రధాన కారణం అధిక రక్తపోటు. అందువల్ల ముందు నుంచే అధిక రక్తపోటు బారినపడకుండా చూసుకోవటం, ఒకవేళ హైబీపీ మొదలైతే క్రమం తప్పకుండా మందులు వేసుకోవటం మంచిది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని