నడుం నొప్పా? మానసిక ఒత్తిడేమో!

నడుం నొప్పి అనగానే ముందుగా వెన్నెముక సమస్య ఉందేమో, కండరాలేవైనా దెబ్బతిన్నాయేమో అనేవే గుర్తుకొస్తాయి. అవే కానక్కర్లేదు. మానసిక ఒత్తిడితోనూ నడుం నొప్పి, మెడ నొప్పి, తల నొప్పులు రావొచ్చు! మనం ఒత్తిడికి గురైనప్పుడు కార్టిజోల్‌ అనే హార్మోన్‌ విడుదలవుతుంది.

Updated : 06 Nov 2020 15:58 IST

డుం నొప్పి అనగానే ముందుగా వెన్నెముక సమస్య ఉందేమో, కండరాలేవైనా దెబ్బతిన్నాయేమో అనేవే గుర్తుకొస్తాయి. అవే కానక్కర్లేదు. మానసిక ఒత్తిడితోనూ నడుం నొప్పి, మెడ నొప్పి, తల నొప్పులు రావొచ్చు! మనం ఒత్తిడికి గురైనప్పుడు కార్టిజోల్‌ అనే హార్మోన్‌ విడుదలవుతుంది. నిజానికిది ఆయా పరిస్థితులు, ప్రమాదాల నుంచి కాపాడుకోవటానికి తోడ్పడేదే అయినా నిరంతరం ఉత్పత్తి అవుతూ వస్తుంటే మాత్రం ముప్పు తప్పదు. ముఖ్యంగా నడుం చుట్టూ కొవ్వు పేరుకుపోవటానికి దారితీస్తుంది. దీంతో వెన్నెముక మీద భారం పెరుగుతుంది. అందుకే మగవారిలో చాలామందిలో ఒత్తిడి నడం నొప్పితోనే బయటపడుతుంటుంది. ఆడవారిలో కొందరిలో వీపు పైభాగాన, భుజాల వద్ద, మెడ వద్ద కొవ్వు పేరుకుపోతుంటుంది. ఇది తలనొప్పులకు దారితీస్తుంది. ఒత్తిడి మూలంగా తలెత్తే నొప్పులు చిన్న పిల్లలనూ వదలటం లేదు. ముఖ్యంగా మెడ, వీపు మధ్య నొప్పులు వేధిస్తుంటాయి. చాలామంది వీటిని మొబైల్‌ ఫోన్ల వాడకంతో వచ్చాయని భావిస్తుంటారు గానీ కాస్త లోతుగా పరిశీలిస్తే అసలు కారణం తెలుస్తుంది. కాబట్టి అకారణంగా నడుం నొప్పి, మెడ నొప్పి వేధిస్తున్నట్టు గమనిస్తే ఒత్తిడికి గురవుతున్నారేమో కూడా ఒకసారి చూసుకోండి. యోగా, ధ్యానం వంటి పద్ధతులతో తేలికగానే ఎవరికి వారు ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. అవసరమైతే నిపుణుల సలహా తీసుకోవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని