గుండెకు ‘స్నేహ’బలం!

మనసు విప్పి మాట్లాడుకునే మిత్రులెవరూ లేరా? అయితే గుండెకు చేటు తెచ్చుకున్నట్టే....

Published : 10 Mar 2020 00:35 IST

నసు విప్పి మాట్లాడుకునే మిత్రులెవరూ లేరా? అయితే గుండెకు చేటు తెచ్చుకున్నట్టే. స్నేహం కరవైన జీవితం పొగ తాగటంతో సమానంగా దుష్ప్రభావాలకు కారణమవుతోంది మరి. ఒంటరితనం మూలంగా రక్తం గడ్డలు ఏర్పడే ప్రక్రియను ప్రేరేపించే ఫైబ్రినోజెన్‌ ప్రొటీన్‌ స్థాయులు పెరుగుతున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. రక్తం గడ్డల మూలంగా గుండెపోటు, పక్షవాతం ముంచుకొస్తాయన్నది తెలిసిందే. నిజానికి ఏదైనా ప్రమాదం ముంచుకొచ్చినప్పుడు ఫైబ్రినోజెన్‌ రక్షణ కవచంగా నిలుస్తుంటుంది. దీని స్థాయులు మరీ ఎక్కువైతే మాత్రం రక్తపోటు పెరుగుతుంది. రక్తనాళాల్లో కొవ్వు పూడికలకు దారితీస్తుంది. స్నేహితులు ఎక్కువగా గలవారిలో.. ఉదాహరణకు- 25 మంది మిత్రులున్నవారితో పోలిస్తే ఐదుగురు స్నేహితులే గలవారిలో ఫైబ్రినోజెన్‌ స్థాయులు 20% ఎక్కువగా ఉంటుండటం గమనార్హం. అంటే స్నేహితుల సంఖ్య తగ్గుతున్నకొద్దీ దీని స్థాయులు పెరుగుతూ వస్తున్నాయన్నమాట. మిత్రుల సంఖ్య మరీ తగ్గితే పొగ తాగటంతో సమానంగా దుష్ప్రభావాలు చూపుతుండటం విశేషం.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని