గుండె మీద పెను భారం

గుండెజబ్బులతో బాధపడేవారికి కరోనా ఇన్‌ఫెక్షన్‌ మరిన్ని చిక్కులు తెచ్చిపెట్టొచ్ఛు నిజానికి ఒంట్లో ఎక్కడ ఎలాంటి ఇన్‌ఫెక్షన్‌ మొదలైనా గుండె మీద భారం పెరుగుతుంది. రక్తాన్ని ఎక్కువగా పంప్‌ చేయాల్సి రావటం వల్ల గుండె వేగంగా కొట్టుకోవాల్సి వస్తుంది.

Published : 24 Mar 2020 01:15 IST

గుండెజబ్బులతో బాధపడేవారికి కరోనా ఇన్‌ఫెక్షన్‌ మరిన్ని చిక్కులు తెచ్చిపెట్టొచ్ఛు నిజానికి ఒంట్లో ఎక్కడ ఎలాంటి ఇన్‌ఫెక్షన్‌ మొదలైనా గుండె మీద భారం పెరుగుతుంది. రక్తాన్ని ఎక్కువగా పంప్‌ చేయాల్సి రావటం వల్ల గుండె వేగంగా కొట్టుకోవాల్సి వస్తుంది. అప్పటికే స్టెంట్‌ అమర్చుకున్నవారికి, బైపాస్‌ సర్జరీ చేయించుకున్నవారికి ఇన్‌ఫెక్షన్‌ కూడా తోడైతే గుండె మీద ఒత్తిడి పెరిగి, ఇంకా ఎక్కువ భారం పడుతుంది. గుండె రక్తాన్ని తగినంతగా పంప్‌ చేయకపోతే అవయవాలన్నీ విఫలమవుతాయి. సాధారణంగానే వయసుతో పాటు గుండెజబ్బుల ముప్పూ పెరుగుతూ వస్తుంటుంది. కరోనా వృద్ధులపై ఎక్కువగా ప్రభావం చూపుతుండటం, చాలామంది అప్పటికే గుండెజబ్బులు, అధిక రక్తపోటు వంటి సమస్యలతో బాధపడుతుండటం వల్ల ఎక్కువ ప్రమాదకరంగా పరిణమించే అవకాశముంది. వీరిలో మధుమేహం, పొగ తాగే అలవాటు వంటి ఇతరత్రా ముప్పు కారకాలూ ఉంటుంటాయి. ఇవీ ప్రాణాపాయానికి దారితీసే ప్రమాదముంది. అధిక రక్తపోటు తగ్గటానికి వేసుకునే ఏసీఈ ఇన్‌హిబిటార్‌, యాంజియోటెన్సిన్‌ రిసెప్టర్‌ బ్లాకర్‌ రకం మందులతో సమస్యలు తలెత్తుతున్నట్టు కొన్ని ఆందోళనలు మొదలైనా వీటితో నష్టం కన్నా లాభాలే ఎక్కువ. నిరభ్యంతరంగా వాడుకోవచ్ఛు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని