నిద్ర శిక్షణ మీదే కావాలి

కరోనా భయం నిజంగానే కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. నిద్ర పట్టకపోవటం, పట్టినా వెంటనే మెలకువ రావటం, నిద్రలేచాక హాయిగా అనిపించకపోవటం వంటి ఇబ్బందులతో చాలామంది సతమతమైపోతున్నారు.

Published : 28 Apr 2020 01:04 IST

రోనా భయం నిజంగానే కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. నిద్ర పట్టకపోవటం, పట్టినా వెంటనే మెలకువ రావటం, నిద్రలేచాక హాయిగా అనిపించకపోవటం వంటి ఇబ్బందులతో చాలామంది సతమతమైపోతున్నారు. వీటిని తప్పించుకోవాలంటే మీకు మీరే నిద్ర శిక్షణ తీసుకోక తప్పదు. ఆఫీసుకు వెళ్లకపోయినా నిద్ర వేళలను విధిగా పాటించాలి. ఒకే సమయానికి పడుకోవాలి, ఒకే సమయానికి లేవాలి. మెలకువ వచ్చినప్పుడు నిద్రపోవాలని అనుకోకపోతే వెంటనే పక్క మీది నుంచి లేవాలి. దీన్ని ఒకరకంగా శరీరానికి శిక్షణ ఇవ్వటమే అనుకోవచ్ఛు పక్క మీదికి చేరుకుంటే అది నిద్ర పోవాల్సిన సమయమని శరీరం గ్రహించేలా చేయొచ్ఛు పడక మంచం మీద కూర్చొని ల్యాప్‌టాప్‌లు ముందేసుకోవటం, టీవీ చూడటం, తినటం వంటివి అసలే చేయొద్ధు పగటిపూట కునుకు తీయాలనుకుంటే మరీ ఎక్కువసేపు పడుకోకూడదు. రోజుకు ఒకసారే కునుకు తీయాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని