మాస్కుధారులు మీరే కావాలి

కరోనా వైరస్‌ కట్టడికి మాస్కు ధరించటం చాలా ముఖ్యం. దగ్గు వంటి లక్షణాలు లేకపోయినా అంతా మాస్కులు ధరించటం మంచిది. ఎందుకంటే కరోనా ఇన్‌ఫెక్షన్‌ ఉన్నా కొందరిలో ఎలాంటి లక్షణాలూ కనిపించకపోవచ్ఛు కానీ వీరి నుంచి ఇతరులకు వైరస్‌ సోకే ప్రమాదముంది.

Published : 28 Apr 2020 01:07 IST

రోనా వైరస్‌ కట్టడికి మాస్కు ధరించటం చాలా ముఖ్యం. దగ్గు వంటి లక్షణాలు లేకపోయినా అంతా మాస్కులు ధరించటం మంచిది. ఎందుకంటే కరోనా ఇన్‌ఫెక్షన్‌ ఉన్నా కొందరిలో ఎలాంటి లక్షణాలూ కనిపించకపోవచ్ఛు కానీ వీరి నుంచి ఇతరులకు వైరస్‌ సోకే ప్రమాదముంది. తుమ్ములు, దగ్గు చెప్పి రావు కదా. ముందే మాస్కు ధరిస్తే తమ నుంచి ఇతరులకు జబ్బు అంటుకోకుండా చెయ్యొచ్ఛు. కరోనా ఉన్నవాళ్లు మాస్కు వేసుకోకపోతే ఇతరులు మాస్కు వేసుకున్నా 70% వరకు వైరస్‌ సోకే అవకాశముంది. అదే కరోనా బాధితులు మాస్కు వేసుకుంటే ఇతరులు మాస్కు వేసుకోకపోయినా వైరస్‌ అంటుకునే ముప్పు 5% మాత్రమే. ఇక అంతా మాస్కులు వేసుకుంటే ఇది 1.5 శాతానికి పడిపోతుండటం గమనార్హం. ఖరీదైనవే అవసరం లేదు, మామూలు గుడ్డ మాస్కులు ధరించినా చాలు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని