ఎలాకూర్చుంటున్నారు?

ఎక్కువసేపు కూర్చుంటే అధిక కొలెస్ట్రాల్‌, గుండెజబ్బులు, మధుమేహం వంటి రకరకాల సమస్యలు చుట్టుముడతాయి....

Published : 05 May 2020 00:52 IST

క్కువసేపు కూర్చుంటే అధిక కొలెస్ట్రాల్‌, గుండెజబ్బులు, మధుమేహం వంటి రకరకాల సమస్యలు చుట్టుముడతాయి. ఇందులో కొత్తేముంది? చాలాకాలంగా తెలిసిందే కదా. అలా పెదవి విరిచేయకండి. ఎంతసేపు కూర్చుంటున్నామన్నది కాదు, ఎలా కూర్చుంటున్నామన్నదే జబ్బుల విషయంలో కీలకపాత్ర పోషిస్తున్నట్టు తాజా అధ్యయనం ఒకటి సూచిస్తోంది. వేటతో జీవనం సాగించే కొందరు గిరిజన తెగలవాళ్లు సైతం ఆధునిక జీవనశైలిని అనుసరించే మనతో సమానంగానే కూర్చుంటున్నట్టు పరిశోధకులు గుర్తించారు. కాకపోతే వాళ్లు మనలా కుర్చీల మీదో, సోఫాల మీదో కూర్చోవటం లేదు. చాలావరకు గొంతుక్కూర్చుంటున్నారు (స్క్వాటింగ్‌). మనకు జబ్బుల ముప్పు పెరగటానికి, వారికి తక్కువగా ఉండటానికి ఈ తేడానే కారణమని పరిశోధకులు భావిస్తున్నారు. గొంతుకూర్చున్నప్పుడు కాలి కండరాలు మరింత బాగా సంకోచిస్తాయి. పైకి లేచినప్పుడు ఎక్కువ శక్తి ఖర్చువుతుంది. శారీరక సామర్థ్యమూ ఇనుమడిస్తుంది. అందుకే ఎక్కువసేపు కూర్చుంటున్నా వారికి అంత ఆరోగ్యం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని