‘ఊపిరిబలం!

కొవిడ్‌-19 విజృంభణతో అందరి దృష్టి ఊపిరితిత్తులపై పడింది. కొత్త కరోనా వైరస్‌ శ్వాసకోశ కణజాలాన్ని దెబ్బతీస్తుండటం...

Published : 19 May 2020 00:22 IST

కొవిడ్‌-19 విజృంభణతో అందరి దృష్టి ఊపిరితిత్తులపై పడింది. కొత్త కరోనా వైరస్‌ శ్వాసకోశ కణజాలాన్ని దెబ్బతీస్తుండటం, ఊపిరితిత్తుల్లోని గాలిగదులు చెడిపోయి ప్రాణాల మీదికి వస్తుండటం చూస్తున్నదే. ఊపిరితిత్తులు బలంగా ఉన్నవారు జబ్బును కాస్త గట్టిగానే ఎదుర్కోగలుగుతుండటం గమనార్హం. అందుకే ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవటం, సామర్థ్యాన్ని పెంచుకోవటం కీలకంగా మారుతోంది. పొగ అలవాటు మానెయ్యటం, కాలుష్యం బారినపడకుండా చూసుకోవటం ద్వారా దీన్ని కొంతవరకు సాధించొచ్ఛు ఇవే కాదు, ఇంకొన్ని జాగ్రత్తలూ మేలు చేస్తాయి.

తగినన్ని నీళ్లు తాగాలి: ఊపిరితిత్తుల లోపల పలుచటి జిగురుపొర ఉంటుంది. ఒంట్లో తగినంత ద్రవం ఉంటే ఈ పొర అలాగే పలుచగా ఉంటుంది. ఇది ఊపిరితిత్తులు బాగా పనిచేయటానికి తోడ్పడుతుంది. అందువల్ల తగినన్ని నీళ్లు తాగటం మంచిది. సీవోపీడీతో బాధపడేవారికి ఇది మరింత ముఖ్యం. దీంతో ఊపిరితిత్తుల్లోని శ్లేష్మం తేలికగా బయటకు వస్తుంది. ఆయాసం తగ్గుతుంది.

నవ్వుతూ ఉండండి: గట్టిగా నవ్వితే కడుపు కండరాలకూ వ్యాయామం లభించినట్టే. ఇది శ్వాస ద్వారా మరింత ఎక్కువగా గాలిని పీల్చుకోవటానికి తోడ్పడుతుంది. నడక, పరుగు, ఆటల వంటి వాటి మాదిరిగానే నవ్వినప్పుడు లోపలుండే చెడుగాలి ఇంకాస్త ఎక్కువగా బయటకు వెళ్లిపోతుంది. పరిశుభ్రమైన గాలి లోపలికి చేరుకుంటుంది. తరచూ గట్టిగా నవ్వుతూ ఉండండి.●

తివాచీలు శుభ్రం: ఇంట్లో పరచుకునే తివాచీల్లో దుమ్ము, ధూళి, తవిటి పురుగులు, బొద్దింకల వ్యర్థాలు, పెంపుడు జంతువుల నూగు వంటివన్నీ పోగుపడతాయి. ఇవి గాలిలో కలిసి ఊపిరితిత్తులను దెబ్బతీయొచ్ఛు కాబట్టి తివాచీలను వారానికి మూడు సార్లు వాక్యూమ్‌ క్లీనర్‌తో శుభ్రం చేయాలి. అలాగే ఏడాదికోసారి ఆవిరితో ఉతికించుకోవాలి.

శారీరక శ్రమ: వ్యాయామం, శారీరక శ్రమ గుండెకు ఎంతో మేలు చేస్తాయి. ఇవి ఊపిరితిత్తులనూ బలోపేతం చేస్తాయి. కొన్ని దీర్ఘకాల ఊపిరితిత్తుల సమస్యలూ తగ్గుముఖం పడతాయి. వ్యాయామం కోసం జిమ్‌కే వెళ్లాల్సిన పనిలేదు. నడక, నెమ్మదిగా పరుగెత్తటం, నీడపట్టున ఆడుకునే ఆటలైనా చాలు. రోజుకు అరగంట చొప్పున వారానికి ఐదు రోజుల పాటు వ్యాయామం చేయటం మంచిది. శ్వాస సమస్యలేవైనా ఉంటే డాక్టర్‌ సలహా మేరకు వ్యాయామాలను ఎంచుకోవాలి. గాఢంగా శ్వాస తీసుకునేలా చేసే ప్రాణాయామం వంటి పద్ధతులూ ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతాయి.

పొయ్యిలతో జాగ్రత్త: గ్యాస్‌ మండుతున్నప్పుడు నైట్రస్‌ ఆక్సైడ్‌ అనే రసాయనం వెలువడుతుంది. దీంతో కొందరిలో ఊపిరితిత్తుల్లో వాపు తలెత్తొచ్ఛు ఇది దగ్గు, పిల్లికూతలకు దారితీయొచ్ఛు ఆస్థమాను ప్రేరేపించొచ్ఛు కలప, బొగ్గు, కిరోసిన్‌ మండించినా ఇలాంటి ఇబ్బందులు కలగొచ్ఛు కాబట్టి వంట గదిలోంచి పొగ సరిగా వెళ్లిపోయేలా చూసుకోవాలి.

బొద్దింకలను తరిమేయాలి: బొద్దింకల విసర్జితాలు, వాటి శరీరం నుంచి రాలిపడే భాగాలు గాలిలో కలిసి ఇంట్లో తిరుగాడుతూ ఉండొచ్ఛు ఇవి అలర్జీలు, ఇతర ఊపిరితిత్తుల సమస్యలను ప్రేరేపించొచ్ఛు చిన్నప్పుడు ఈ దుమ్ము ప్రభావానికి గురైన పిల్లలకు ఆస్థమా వచ్చే అవకాశం ఎక్కువ. అందువల్ల ఇంట్లో బొద్దింకలు లేకుండా చూసుకోవాలి.

చేతులు శుభ్రం: జలుబు, ఫ్లూ వంటి ఇన్‌ఫెక్షన్లు కొన్నిసార్లు తీవ్ర సమస్యలకు దారితీయొచ్ఛు తరచూ సబ్బుతో చేతులను కడుక్కుంటుంటే ఇలాంటి జబ్బుల బారినపడకుండా చూసుకోవచ్ఛు అలాగే రోజుకు రెండు సార్లు పళ్లను తోముకోవటం మరవరాదు. చిగుళ్ల ఇన్‌ఫెక్షన్‌కు కారణమయ్యే బ్యాక్టీరియా ఊపిరితిత్తుల్లోకి చేరి ఇబ్బందులు కలగించొచ్ఛు కాబట్టి ఏడాదికి ఒకసారైనా డాక్టర్‌ను సంప్రదించి పళ్లను పరీక్షించుకోవాలి. ఏటా ఫ్లూ టీకా తీసుకోవాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు