‘బాధ’ వెంటాడుతోంది!

ఒకవైపు కరోనా విజృంభణ. మరోవైపు జీవనోపాదులు కోల్పోవటం. దీంతో ఎంతోమంది దిగులు, విచారంతో కుమిలిపోవటం చూస్తూనే ఉన్నాం. అలాగని అదేపనిగా బాధపడుతూ కూర్చుంటే సమస్య మరింత జటిలమయ్యే ప్రమాదముంది.

Published : 02 Jun 2020 01:53 IST

కవైపు కరోనా విజృంభణ. మరోవైపు జీవనోపాదులు కోల్పోవటం. దీంతో ఎంతోమంది దిగులు, విచారంతో కుమిలిపోవటం చూస్తూనే ఉన్నాం. అలాగని అదేపనిగా బాధపడుతూ కూర్చుంటే సమస్య మరింత జటిలమయ్యే ప్రమాదముంది. మనం దేని గురించైనా బాధపడుతున్నప్పుడు ఒత్తిడి హార్మోన్ల ఉత్పత్తి పెరిగిపోతుంది. దీంతో రక్తంలో గ్లూకోజు స్థాయులూ పెరుగుతాయి. దీన్ని శరీరం వినియోగించుకోకపోతే మొదటికే మోసం వస్తుంది. మున్ముందు వాడుకోవటానికి వీలుగా శరీరం గ్లూకోజును దాచిపెట్టుకుంటుంది. ఇది అధిక బరువు, మధుమేహం వంటి సమస్యలకు దారితీస్తుంది. ఒకవేళ అప్పటికే వీటితో బాధపడుతుంటే, గ్లూకోజు స్థాయులు నిరంతరం ఎక్కువగా ఉంటుంటే గుండెజబ్బులు, పక్షవాతం, కిడ్నీ జబ్బుల వంటి వాటికి దారితీస్తుంది. కాబట్టి వీలైనంత త్వరగా బాధ, విచారం, దిగులు నుంచి బయటపడేందుకు ప్రయత్నించటం మంచిది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని