పేగు శక్తి

రోగనిరోధకశక్తిని పెంపొందించుకోవాలా? అయితే జీర్ణకోశాన్ని ఆరోగ్యంగా ఉంచుకోండి. సుమారు 70% రోగనిరోధక...

Published : 23 Jun 2020 00:31 IST

రోగనిరోధకశక్తిని పెంపొందించుకోవాలా? అయితే జీర్ణకోశాన్ని ఆరోగ్యంగా ఉంచుకోండి. సుమారు 70% రోగనిరోధక వ్యవస్థకు పేగులే నిలయాలు! వీటిలోని బ్యాక్టీరియా అస్తవ్యస్తమైతే నిరోధకశక్తీ తగ్గుతుంది. తిండి మీద కాస్త దృష్టి పెడితే దీన్ని కాపాడుకోవచ్ఛు పాలిష్‌ పట్టిన ధాన్యాలతో చేసిన పదార్థాలు, వేపుళ్లకు కళ్లెం వేస్తే బ్యాక్టీరియాను కాపాడుకున్నట్టే. పీచుతో నిండిన పండ్లు, కూరగాయలు.. బ్యాక్టీరియాను వృద్ధి చేసే పులియబెట్టిన పదార్థాలు, పెరుగు, మజ్జిగ వంటివీ విధిగా తీసుకోవాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని